సాయం కోసం తన దగ్గరకు వచ్చిన ఓ పెద్దాయనతో ఒక ఐపీఎస్ అధికారి వ్యవహరించిన తీరుకు నెటిజన్స్ ఫిదా అయ్యారు. ఇలాంటి అధికారుల అవసరం దేశానికి మరింతగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేయడానికి లభించిన గొప్ప అవకాశంగా భావించాలి. కానీ కొందరు అధికారులు దీనికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ప్రజల గోడు అస్సలు పట్టించుకోరు. ఇంకొందరైతే తమ స్వార్థం కోసం సర్కారు ఆఫీసులను అవినీతి, లంచానికి కేంద్రాలుగా మారుస్తున్నారు. దీంతో వారు అడిగిన డబ్బులు ఇవ్వలేక, పని అవ్వక ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్లకు వేసుకున్న చెప్పులు అరిగేలా తిరగడం తప్ప సామాన్యులకు మరో మార్గం లేకుండా పోతోంది. ఇలాంటి ఘటనల గురించి వార్తల్లో చూస్తునే ఉన్నాం. కానీ ఇలాంటి వారి మధ్య కూడా కొందరు మంచి ఆఫీసర్స్ ఉంటారు. ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా చేస్తుంటారు.
సేవా దృక్పథంతో సాయం కోసం వచ్చిన వారికి అన్నీ తామై అండగా నిలబడతారు. అలాంటి ఓ అధికారే సౌమ్యా పాండే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లా ఐఏఎస్ అధికారి సౌమ్యపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె తన సింప్లిసిటీ, సేవా దృక్పథంతో ప్రజల మనసులను దోచుకున్నారు. ధనీరామ్ అనే పెద్దాయన రాష్ట్ర సర్కారు స్కీమ్ ద్వారా ఎలక్ట్రిక్ బైక్ కొనేందుకు సాయం చేయాలంటూ వెళ్లాడు. ఆయన సమస్యను దగ్గరుండి తెలుసుకున్న సౌమ్య.. ఎండలోనూ ఆయన వివరాలు అడిగి కచ్చితంగా సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సౌమ్య.. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
దివ్యాంగుడైన ధనీరామ్‌కు ఎలక్ట్రిక్ బైక్ కొనేందుకు అవసరమైన సాయం అందించాలని సంబంధిత ఆఫీసర్స్‌ను ఆమె ఆదేశించారు. దీంతో సౌమ్యపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంత పెద్ద హోదాలో ఉండి కూడా సామాన్యుడితో సౌమ్య ప్రవర్తించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. ధనీరామ్తో ఆమె ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫొటోలను నెటిజన్స్ షేర్ చేస్తున్నారు. మరి.. సౌమ్యా పాండే లాంటి అధికారుల అవసరం దేశానికి మరింతగా ఉందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ऐसे लोग बहुत ही कम होते हैं अपने अपने संस्कार भी है जो मिला है आप को मेरा सादर प्रणाम आप जैसे लोग समाज को मजबूत बनाने वाले लोग हैं
ये कानपुर देहात में CDO के पद पर तैनात IAS सौम्या पांडेय है।वृद्ध दिव्यांग व्यक्ति ट्राई साइकिल की गुहार लेकर इनके दफ्तर पहुंचा। नजर पड़ते ही… pic.twitter.com/qKJTwH1Mgk
— Vivek Pandey (@VivekKumar_IND) April 2, 2023