ఈ మధ్యకాలంలో కుక్కలు సృష్టిస్తున్న వార్తలు అన్నిఇన్ని కావు. ఎక్కడ చూసిన వీటికి సంబంధించిన వార్తలో ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుక్కల దాడిలో పలువురు మృతి చెందగా, మరికొందరు తీవ్రగాయలతో ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారు. వీటిని అరికట్టేందుకు మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఓ ప్రాంతంలో కుక్కను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ మధ్యకాలంలో కుక్కలు సృష్టిస్తున్న వార్తలు అన్నిఇన్ని కావు. ఎక్కడ చూసిన వీటికి సంబంధించిన వార్తలో ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుక్కల దాడిలో పలువురు మృతి చెందగా, మరికొందరు తీవ్రగాయలతో ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారు. వీటిని అరికట్టేందుకు మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక ఓ ప్రాంతంలో మాత్రం తప్పి పోయిన శునకం కోసం పోలీసులు తీవ్రం గాలింపు చర్యలు చేస్తున్నారు. మూడు రోజులుగా ఓ కుక్క ఆచూకీ కోసం చెమటలు కక్కుతూ వెతుకుతున్నారు. మరి.. ఎందుకు ఆ శునకం కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అని పెద్దల మాట ఒకటి వాడుకలో ఉన్న సంగతి తెలిసిందే. అలానే తాజాగా మధ్యప్రదేశ్ లోని గ్యాలియర్ ప్రాంతంలో తప్పిన పోయిన శునకం విషయం జరిగింది. కనిపించకుండా పోయిన తన పెంపుడు శునకాన్ని వెతికి పట్టుకురమ్మంటూ పోలీసులకు ఓ ఐఏఎస్ అధికారి ఆదేశాలు జారీ చేశారు. సాక్షాత్తూ ఐఏఎస్ అధికారి ఆదేశించడంతో పోలీసులు సదరు కుక్క కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఢిల్లీలో నివసించే రాహుల్ ద్వివేది అనే ఐఏఎస్ అధికారికి రెండు పెంపుడు శునకాలు ఉన్నాయి. కారులో ఢిల్లీ నుంచి గ్వాలియర్ వెళ్తుండగా బిలువా ప్రాంతంలో శునకం తప్పిపోయింది.
బిలువా ప్రాంతంలో భోజనం కోసం ఆపడంతో.. సిబ్బంది చేతుల్లోంచి రెండు శునకాలు తప్పించుకుని పారిపోయాయి. ఈ క్రమంలో సిబ్బంది వాటి వెంటబడి ఒక శునకాన్ని పట్టుకున్నారు. మరొకటి మాత్రం దొరకలేదు. దీంతో దానిని కూడా పట్టుకోవాలని రాహుల్ ద్వివేది పోలీసులను అదేశించారు. దీంతో గ్వాలియర్ పోలీసులు ప్రస్తుతం ఆ కుక్క కోసం గాలిస్తున్నారు. అలానే పట్టించిన వారికి బహుమతి ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. మూడు రోజులుగా ఆ శునకం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.