పెళ్లెప్పుడవుతుందో బాబోయ్.. నాకు పిల్ల ఏడ దొరుకుతుందో బాబోయ్ అంటూ ఓ యువకుడు రోడ్డు మీద పడ్డాడు. అంత వరకు ఓకే కానీ, ఓ పోస్టర్ పై వధువుకు సంబంధించిన అర్హతలను రాసి, దాన్ని పట్టుకుని నడి రోడ్డులో నించున్నాడు. పిల్ల దొరకడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో తన కోరికల చిట్టా తెరిచాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెట్టింట్ల వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ కోరిక చిట్టా ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
మధ్యప్రదేశ్ లోని చింద్వారా కు చెందిన ఓ యువకుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. అయితే ఆ అమ్మాయికి కొన్ని అర్హతలు ఉండాలని భావించి అతగాడు.. తన కోర్కెను పేపర్ పై రాసి నడి రోడ్డులో నించొని పెళ్లి ప్రతిపాదన చేశాడు. తాను పెళ్లి చేసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగం చేసే అమ్మాయికి కావాలని, కావాలంటే కన్యాశుల్కం (ఎదురు కట్నం) కూడా ఇస్తానంటూ అందులో పేర్కొన్నాడు. దీన్ని చూసిన వారంతా నవ్వుకున్నారు. ఏమో ఎవరూ చూడొచ్చారు.. అతని స్టైల్, డిమాండ్ చూసి ప్రభుత్వ ఉద్యోగం చేసే అమ్మాయి అతడి ప్రతి పాదన అంగీకరిస్తుందో. ఆ వీడియోను మీరు చూసి ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
*शादी के लिये सरकारी नौकरी वाली लड़की चाहिये,दहेज़ मैं दे दूंगा*
*छिंदवाड़ा का एक युवक एक पोस्टर ले कर खड़ा हुआ मात्र 26 सेकंड का विडिओ जबरदस्त वायरल हो गया ।@BIbhopal #mens pic.twitter.com/LAyfyQ8xDy
— Sushant Peter (@SushantPeter302) January 25, 2023