వంట దగ్గర నుండి ఆర్థిక పరమైన, కుటుంబ పరమైన వ్యవహారాల్లో దంపతుల మధ్య తగాదాలు మొదలవుతాయి. కొన్ని విషయాల్లో చిలికి చిలికి గాలి వానగా మారి.. మనస్పర్థలు ఏర్పడి.. పెద్ద తగాదాలకు తెరలేపుతున్నాయి. కలిసి ఉందామన్న పరిస్థితులు పోయి విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్టెక్కుతున్నారు.
చిన్నచిన్న విషయాల దగ్గరే కొంత మంది భార్యా భర్తలు గొడవలు పడుతుంటారు. భర్త ఓ మాట అంటే భార్యకు పడదు. భార్య బాధ్యతగా ప్రశ్నిస్తే.. పురుష అహంకారం అడ్డు వస్తుంది. చివరకు వంట దగ్గర నుండి ఆర్థిక పరమైన, కుటుంబ పరమైన వ్యవహారాల్లో తగాదాలు మొదలవుతాయి. కొన్ని విషయాల్లో చిలికి చిలికి గాలి వానగా మారి.. మనస్పర్థలు ఏర్పడి.. పెద్ద తగాదాలకు తెరలేపుతున్నాయి. ఒకరిని ఒకరు దూషించుకోవడం దగ్గర నుండి చేయి చేసుకునేంత వరకు వెళుతుంది. దీంతో కలిసి ఉందామన్న పరిస్థితులు పోయి విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్టెక్కుతున్నారు. అయితే కోర్టులు కూడా విడదీయడానికి కాదూ.. కలిపేందుకు ప్రయత్నాలు చేస్తాయి. అటువంటి సంఘటనే ఇది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని గోపాల్ గంజ్ ప్రాంతంలో నివసిస్తున్నారు సోను, వర్ష దంపతులు. వీరికి 2017లో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో సోను ప్రైవేట్ టీచర్‌గా ఉన్నాడు. అయితే కరోనా సమయంలో వీరిద్దరి మధ్య చిన్న విషయాలపై గొడవ మొదలైంది. దీంతో ఆమె భర్తపై గొడవపడి 3 ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. గత ఏడాది ఆమె విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్లింది వర్ష. విచారణ చేపట్టిన కోర్టు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చింది. విడిపోతే వచ్చే అనార్థాల గురించి చెప్పారు. అయినప్పటికీ వీరిద్దరిలో మార్పు రాలేదు. ఫ్యామిలీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి అతుల్ ఇక లాభం లేదననుకుని ఇద్దరి తండ్రులను పిలిపించి మాట్లాడారు.
మళ్లీ సయోధ్య కుదిర్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారు న్యాయమూర్తి. అయితే వీరిలో ఆలోచనల్లోక్రమంగా మార్పులు రావడం ప్రారంభమైంది. చివరకు వారిద్దరూ కలిసి ఉండేందుకు అంగీకరించారు. ఇకపై చిన్న విషయాలకు గొడవపడకూడదని నిర్ణయం తీసుకున్నారు. అత్తగారింటికి వెళ్లేందుకు వర్ష ఆమోదం తెలిపింది. దీంతో ఫ్యామిలో కోర్టులో చివరి కౌన్సిలింగ్ సెషన్ సమయంలో జడ్జీ, ఇరువురి కుటుంబ సభ్యుల ముందు తిరిగి కలిసి ఉంటామని, కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో ఒకరికొకరు పూల దండలు మార్చుకుని సరికొత్త జీవనానికి నాంది పలికేందుకు సిద్ధమయ్యారు.