పెళ్లి అనేది నూరేళ్ల జీవిత ప్రయాణం. ఎన్ని ఆపదలు వచ్చినా తట్టుకుంటూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉంటూ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. వరుడు నచ్చలేదనో, వధువు నచ్చలేదనో, అధనపు కట్నం కోసం వేధింపులు శరమామూలే అయిపోయాయి. ఇదే కోవకు చెందిన ఓ ప్రభుద్దుడు పెళ్లి తరువాత భార్యతో కాపురం చేయకుండా అదనంగా డబ్బులిస్తేనే సంసారం చేస్తానని చెప్పిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

యూపికి చెందిన ఓ కీచక భర్త పెళ్లి తరువాత భార్యతో కాపురం చేయకుండా, హనీమూన్ కు తీసుకెళ్లడానికి అదనంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని పేచీ పెట్టాడు. దీంతో వారు గత్యంతరం లేక రూ .5 లక్షలు ముట్టజెప్పారు. ఆ డబ్బుతో హనీమూన్ కు వెళ్లారు. హనీమూన్ లో భార్య అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను తీసి, మిగతా రూ. 5లక్షలు కావాలని లేదంటే సామాజిక మాధ్యమాల్లో పెడతానని అత్తింటివారిని బెదిరించసాగాడు. వివరాల్లోకి వెళ్తే.. బుదౌన్ లోని బిసౌలీ ప్రాంతానికి చెందిన వ్యక్తితో పిలిబిత్ కు చెందిన యువతికి ఫిబ్రవరిలో పెళ్లి జరిగింది. వివాహం తరువాత మొదటి రాత్రి జరుపుకోలేదు. కొన్ని రోజుల పాటు కాపురం చేయకుండా దూరంపెట్టసాగాడు. భర్త గురించి అత్తింటివారితో చెప్పినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో ఆమె భర్తను తనను ఎందుకుదూరం పెడుతున్నావంటూ నిలదీసింది. అప్పుడు ఆ భర్త తన వక్ర బుద్దికి పనిచెప్పాడు. తనకు అదనంగా 10లక్షలు ఇస్తేనే కాపురం చేస్తానని తెగేసి చెప్పాడు. అయితే ఆ యువతి తల్లిదండ్రులు కుమార్తె కాపురం భాగుండాలని అల్లుడికి రూ. 5లక్షలు అందించారు. ఆ తరువాత భార్యను తీసుకుని నైనిటాల్ కు హనీమూన్ కు వెళ్లారు. హనీమూన్ లో భార్య అశ్లీల వీడియోలు, ఫోటోలు తీశాడు. మిగతా 5లక్షలు ఇవ్వకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. భర్త ప్రవర్తనతో విసుగెత్తి పోయిన భార్య పుట్టింటికి చేరుకుని జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని బోరున విలపించింది. తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్తతో పాటు అత్తమామలపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.