సాధారణంగా పెళ్లైన కొత్త జంట సరదగా గడుపుతుంటారు. ఈక్రమంలో విహారయాత్రలు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొన్ని జంటలు మాత్రం సరదగా గడిపే సమయంలో అత్యుత్సాహాన్ని చూపిస్తుంటారు. పక్కన జనం ఉన్నరు అనే సంగతే మరచి శృతి మించి ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ జంట పవిత్ర సరయూ నదిలోకి స్నానం చేసేందుకు వెళ్లారు. ఈక్రమంలో స్నానం చేస్తూ భర్త… భార్యకు ముద్దు పెట్టాడు. అది చూసిన పక్కనే ఉన్న జనం భర్తపై చేయి చేసుకున్నారు. ఈఘటన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జరిగింది. ఈ ఘటన కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..
శ్రీరాముడిని దర్శించుకునేందుకు ఓ యువ జంట ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ప్రవహించే పవిత్ర సరయూ నదిలో స్నానం చేసేందుకు సిద్దమయ్యారు. ఆ దంపతులు నదిలోకి దిగి స్నానం చేస్తూ.. సరదగా గడుపుతున్నారు. వీరితో పాటు చాలా మంది భక్తులు కూడా అక్కడ స్నానాలు చేస్తున్నారు. అందరు అక్కడ ఉండాగానే భర్త.. భార్యతో చనువుగా ప్రవర్తించాడు. అలా వారి ఇద్దరి ప్రవర్తన శృతిమించింది. దీంతో పవిత్రమైన ప్రదేశంలో స్నానాలు ఆచరిస్తూ ఇలాంటి ఏమిటని అక్కడ ఉన్న భక్తులు వారిని ప్రశ్నించారు. భర్తను బయటకు తీసుకొచ్చి దేహశుద్ది చేశారు. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా తెగ వైరల్ అయి పోలీసులకు చేరింది. దీంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వీడియో కోసం – ఇక్కడ క్లిక్ చేయండి