ఇటీవల కాలంలో భారీగా భూకంపాలు వస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉంటున్నారు. ఆ మద్య ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపంతో ఎంతో మంది చనిపోయారు. వేల మంది నిరాశ్రులయ్యారు. భూకంపాలు వచ్చినపుడు ప్రాణ, ఆస్తి నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇటీవల భారత దేశంలో కూడా వరుసగా భూకంపాలు సంబవిస్తున్నాయి. మెక్సికో నగరంలో తీవ్ర స్థాయిలో భూకంపం సంబవించింది. దీంతో ప్రజలు భయంతో వణికిపోయారు. వివరాల్లోకి వెళితే..
మెక్సికో సెంట్రల్ పసిఫిక్ తీరంలో తీవ్ర స్థాయిలో భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6 గా నమోదు కావడంతో అధికారులు సైతం నివ్వెరపోయారు. ఒకప్పుడు ఇదే తరహాలో మెక్సికోలో భారీ స్థాయిలో భూకంపాలు వచ్చాయి. మరోసారి భూకంపం రావడంతో ప్రజలు గజ గజ వణికిపోయారు. భూకంప తీవ్రతకు భవనాలు, కార్లు, బైకులు ఒక్కసారిగా ఊగిపోయాయి. కొన్ని స్విమ్మింగ్ ఫూల్స్ లో చిన్నపాటి తుఫాన్ వచ్చిందా భయాన్ని కల్పించింది.
ఇక భూకంపం భయంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్లు భారీ వృక్షాలు కూలిపోయాయి. ఈ భూకంప ప్రభావానికి ఒక వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇంత స్థాయిలో భూకంపం రావడంతో అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ భూకంప తీవ్రత అక్విలాకు కొన్ని కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు అంటున్నారు. ఈ భూకంపానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Breaking: Video shows the moment an earthquake was felt in Mexico City. The preliminary magnitude 7.6 earthquake struck off the coast of Michoacán. pic.twitter.com/JKaYajjMO1
— PM Breaking News (@PMBreakingNews) September 19, 2022
MEXICO.
An earthquake of magnitude 7.4 occurred in the west of the state of Michoacán. The source lay at a depth of 25 km. The epicenter was located 103 km from the city of Colima. pic.twitter.com/NB4r4E3nu0— Asif Tintoiya (@TintoiyaAsif) September 19, 2022