బాలీవుడ్‌లో హనీట్రాప్ వ్యవహారం రోజు రోజుకు సంచనలంగా మారుతోంది. అందమైన సెలబ్రెటీలు, అమ్మాయిలకు వలేసి నగ్నవీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేస్తొందీ నయా సెక్స్‌టార్షన్ గ్యాంగ్. ఒకరా, ఇద్దరా..ఏకంగా 100 సెలబ్రెటీల న్యూడ్ ఫోటోస్, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు దిగుతోందీ ఈ ముఠా.
ఇక సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలైన లేక అందమైన అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టడం మొదలు పెడతారు. ఆ పై మెల్లగా మాట మాట కలిపి ఆ తర్వాత వీడియో కాల్, న్యూడ్ ఫోటోస్ అంటూ కాలు దువ్వుతారు. పైగా యువతుల మైనస్ పాయింట్‌పై దెబ్బకొట్టి ఉన్నకాడికి దోచేస్తున్నారు ఈ సెక్స్‌టార్షన్ నయా మోసగాళ్లు. ఇక ఇంతటితో ఆగకుండా వారి న్యూడ్ వీడియోస్‌ను డార్క్‌వెబ్, ఫోర్న్ సైట్లకు వంటి వెబ్‌సైట్‌లకు అమ్ముకుని డబ్బులు దండుకుంటున్నారు.
ఇక హనీట్రాప్ వ్యవహారంలో చిక్కుకున్న కొందరు సెలబ్రెటీల ఫిర్యాదులు ముంబాయిలోని సైబర్ సెల్‌కి కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఇక రంగంలోకి దిగిన ముంబై పోలీసులు ఇప్పటికి నలుగురి నిందితులను అరెస్ట్ చేశారు. కాగా ఇప్పటికీ హనీట్రాప్ వ్యవహారంలో ఏకంగా 285 మందిపై యువతుల నగ్న వీడియోల డేటా వీరి వద్ద ఉన్నట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. దీంతో ఈ వ్యవహారం తాజాగా ముంబై వ్యాప్తంగా సంచలనంగా మారుతూ బాలీవుడ్ సెలబ్రెటీలకు చుక్కులు చూపిస్తున్నారు.