పంజాబ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు ప్రవర్తనపై విసుగెత్తి ఓ హోంగార్డు రోడ్డుపై వినూత్న నిరసనకు దిగాడు.
పంజాబ్ రాష్ట్రంలో ఓ హోంగార్డ్ వినూత్న నిరసనకు దిగాడు. రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి..వాహనాలను నిలిపివేశాడు. రోడ్డుపై పడుకుని నినాదాలు చేస్తూ తన నిరసన వ్యక్తం చేశాడు. నేను దొంగలను అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుని దొంగలను వదిలేస్తున్నారని నినాదాలు చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన చేశాడు. ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నపుడు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ హోంగార్డ్ అక్కడి పోలీసుల అవినీతినిచూసి భరించలేకపోయాడు. దీంతో ఓ పెద్దతాడు జాతీయ రహదారికి అడ్డంగా కట్టి వాహనాలను నిలిపివేశాడు. ఆ తర్వాత రోడ్డుపై అడ్డంగా పడుకుని ‘నేను దొంగలను అరెస్ట్ చేస్తే మా పోలీసులు లంచం తీసుకుని వారిని వదిలేస్తున్నారు’ అంటూ హైవేపై నిరసన వ్యక్తం చేశాడు. అదిచూసి చుట్టుపక్కల జనం, వాహనదారులు అవాక్కయ్యారు.
అక్కడ ఉన్న మరో పోలీసు అధికారి నిరసనకు దిగిన హోంగార్డ్‌ను రోడ్డుపైనుండి లేపే ప్రయత్నం చేశాడు. హోంగార్డ్ వినకుండా అలాగే నినాదాలు చేస్తుంటే అతనిని కాలితో తన్నాడు. దీంతో ఆ పోలీసు అధికారి ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై భోగ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సుఖ్‌జిత్ మాట్లాడుతూ.. ‘ఒక గొడవకు సంబంధించి ఓ యువకుడిని హోంగార్డ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు. బెయిల్ మంజూరు అయింది. దీని తర్వాత ఆ యువకుడు విడుదల అయ్యాడు’ అని వెల్లడించారు.
‘Jehra mai chor fad ke liauna oh Thane Wale paise laike chadi jande’
रिश्वतखोरी से दुखी हो कर पुलिस मुलाजिम ने #jalandhar के भोगपुर में रोड जाम कर विरोध प्रदर्शन किया। #PunjabPolice pic.twitter.com/QyajO37Cvd— Harpinder Singh (@HarpinderTohra) July 22, 2023