సాధారణంగా పల్లెటూర్లలో పెళ్లి క్యాన్సిల్ అయితే ఏం చేస్తారు. ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడం మానేస్తాయి. అదే వారు బంధువులైతే రాకపోకలు కూడా ఉండవు. చూపులతోనే కత్తులు దూస్తారు. మరి నిశ్చితార్థం ఆగిపోతే.. దాన్ని అంత పెద్దగా పట్టించుకోరు. ఆగిపోవడానికి కారణాలు కనుగొని వాటిని పరిష్కరిస్తారు. అంతేకదా.. కానీ రాజస్తాన్ లో అలా కాదు. ఎంగేజ్ మెంట్ ఆగిపోతే ఏం చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
రాజస్తాన్ లోని బార్మర్ పట్టణంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే కమల్ సింగ్ భాటి అనే వ్యక్తి తన బంధువులలోని ఓ యువకుడితో తన కూతురి ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు చేశాడు. యువకుడి తరపు వారు అన్ని ఏర్పాట్లు చేసుకుని నిశ్చితార్థానికి రడీగా ఉన్నారు. ఇంతలో కమల్ సింగ్ తనకు ఎంగేజ్ మెంట్ ఇష్టం లేదంటూ చెప్పాడు. చూట్టాలు ఎంత చెప్పినా అతగాడు వినలేదు. దానికి కారణాలను సైతం అతడు వెల్లడించాడు.
గతంలో తన మేనకోడలిని ఆ ఇంటికి ఇస్తే వరకట్న వేధింపులతో ఆమెను చంపారని తెలిపాడు. ఇప్పుడు నాకుతురిని కూడా అలాగే చేస్తారనే భయంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమల్ సింగ్ తెలిపాడు. ఈక్రమంలో నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేశాడన్న వార్త పెళ్లి కుమారుడికి తెలిసింది. దీంతో కొపంతో అతడు బంధువులతో కలిసి కాబోయే మామ ఇంటిపైకి 10 మందితో దాడికి దిగాడు.
కమల్ సింగ్ పొలానికి వెళ్లే సమయంలో అతని పై విచక్షణారహితంగా దాడిచేసి అతని చెవులు, ముక్కును కోశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. మరి ఈ ఆశ్చర్యకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.