మన దేశంలో జంతు ప్రేమికులు ఎక్కువే. కోడి, మేక, చేప వంటి వాటిని కోసుకు తినేసిన వాళ్ళని ఏమీ అనరు గానీ సినిమాల్లోనూ, సర్కస్ లోనూ వాటితో పని చేయిస్తే మాత్రం మేమున్నాం అంటూ జంతు ప్రేమికులు వెంటనే ఆట్ అంటూ ఖండించేస్తారు. వీళ్ళ వల్ల సర్కస్ అనే అందమైన కళకి పెద్ద దెబ్బ పడిందనే చెప్పుకోవాలి. ఇదలా ఉంచితే జంతు ప్రేమికులకు ఇప్పుడు భారీ షాక్ తగిలింది. ఇక నుంచి వీధి కుక్కలకి బహిరంగ ప్రదేశాల్లో గానీ రోడ్ల మీద గానీ పార్కుల్లో గానీ తిండి పెడితే జరిమానా విధించాల్సి ఉంటుంది. రోడ్ల మీద కుక్క కనబడితే.. వాటికి తిండి పెట్టి తమ గొప్ప మనసు చాటుకుంటారు కొంతమంది జంతు ప్రేమికులు. అయితే కుక్కలకి బయట రోడ్ల మీద తిండి పెడితే ఇక నుంచి నేరమని మీకు తెలుసా?
అవును రోడ్లపై కుక్కలకు తిండి పెడితే రూ. 200 పైనే జరిమానా విధిస్తారు. ఇదెక్కడి గొడవరా బాబూ.. కుక్కలకి సాయం చేస్తే జరిమానా ఏంటి పిచ్చి కాకపోతే అని అనుకోకండి. ఇంకా ఆర్టికల్ ఆఫ్ ఇండియా పూర్తి కాలేదు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో వీధి కుక్కల బెడద ఎక్కువవుతుండడంతో బొంబాయి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధుల్లో తిరిగే కుక్కలకు తిండి పెట్టే ఉద్దేశం ఉన్న జంతు ప్రేమికులు వాటిని దత్తత తీసుకోవాల్సిందిగా కోర్టు సూచించింది. వాటిని ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా తిండి పెట్టుకోమని తీర్పు ఇచ్చింది. నాగ్ పూర్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే స్థానికులెవరూ కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టకూడదని, ఒకవేళ ఆహారం పెట్టే ప్రయత్నం చేస్తే జరిమానా తప్పదని ఆదేశించింది.
న్యాయమూర్తులు ఎస్బీ శుక్రే, ఏఎల్ పన్సారేలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇది అమలయ్యేలా చూడాలని నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదేశించింది. ఎవరైనా సరే తమ సొంత ఇళ్లకు తీసుకెళ్లి వాటికి తిండి పెట్టాలి గానీ బయట పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ కుక్కలకు తిండి పెట్టాలి అనుకుంటే గనుక దత్తత తీసుకుంటున్నట్టు మున్సిపల్ అధికారుల దగ్గర రిజిస్టర్ చేసుకోవాలని లేదా డాగ్స్ షెల్టర్ హోమ్స్ లో కుక్కలని ఉంచి.. వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ తిండి పెట్టవచ్చునని బొంబాయి హైకోర్టు అక్టోబర్ 20న ఉత్తర్వులు జారీ చేసింది. వీధి కుక్కలను నియంత్రించడానికి పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది.
ఇదిలా ఉంటే వీధి కుక్కల జనన నియంత్రణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 17 కోట్ల నిధులను కేటాయించింది. దీనికి కోర్టు కూడా ఆమోదం తెలిపింది. కుక్కల వృషణాలు, అండాశయాలను తొలగించడం ద్వారా వీధి కుక్కల జననాలను నియంత్రించనున్నారు. డాగ్ షెల్టర్ హోమ్ ని ఏర్పాటు చేయడం ద్వారా వీధి కుక్కల బెడదను తగ్గించవచ్చునని కోర్టు తెలిపింది. ఏది ఏమైనా గానీ నాగ్ పూర్ లో కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో తిండి పెడితే మూల్యం చెల్లించుకోక తప్పదు. అదన్నమాట విషయం.
Bombay High Court (Nagpur Bench) issues directions on on feeding of stray dogs :
“If any person is interested in feeding stray dogs, he shall first adopt the stray dog, bring it to home, register it with Municipal authorities or put it in some dog shelter”- Court orders. pic.twitter.com/pxyXNapu2Z
— Live Law (@LiveLawIndia) October 21, 2022