సాధారణంగా సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ వినిపిస్తుంటాయి. ఆ మద్య నాని నటించిన ‘నేను లోకల్’ లో పోలీస్ స్టేషన్ లో రక రకాల ఫిర్యాదుల చేయడానికి వస్తారు.. అందులో ఓ బాలుడు నా పెన్సిల్ పోయిందని ఫిర్యాదు చేస్తే.. ఏలా పోయిందని పోలీస్ అడుగుతాడు. చాక్ మార్ లో పెట్టి తిప్పాను.. కనిపించకుండా పోయిందని అంటాడు. దాంతో పోలీస్ షాక్ తింటాడు.
ఇది సినిమాల వరకు అయితే నవ్వు వస్తుంది.. కానీ నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురైతే.. కానీ నిజంగానే పోలీసు అధికారులకు ఎదురైందీ ఘటన. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్ జిల్లా సింధూరియన్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఈ ఫిర్యాదు అందింది. అయితే ఈ ఫిర్యాదు చేసింది ఓ సామాన్య వ్యక్తి కాదు.. స్వయానా మాజీ ఎమ్మెల్యేకు తనయుడు కావడంతో పోలీసులకు ఫిర్యాదు తీసుకోవాల్సి వచ్చింది. సింధూరియన్ పోలీసు స్టేషన్ పరిధిలోని పిప్ర కళ్యాణ్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దుఖీ ప్రసాద్ కుమారుడు రాజ్‌కుమార్ భారతి నివసిస్తుంటారు.
సింధూరియన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన కోడికి ఎవరో విషం పెట్టి చంపేశారని.. చనిపోయిన కోడికి పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ ఉన్న పోలీసులు అవాక్కయ్యారు.. కానీ ఫిర్యాదు చేసేది మాజీ ఎమ్మెల్యే కొడుకు కావడంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మాజీ ఎమ్మెల్యే తనయుడు రాజ్ కుమార్ భారతి మాట్లాడుతూ.. తనకు చిలుకలు, పావురాలుళ్లు, కోళ్లను పెంచుకునే అలవాటు ఉందని.. తన కోడికి ఎవరో విష ప్రయోగం చేసినట్టు ఆనవాళ్లు ఉండటం వల్లనే పోస్టు మార్టంలో ఈ నిజాలు బయటకు వస్తాయన్న ఉద్దేశంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.