దేశ ఆర్ధిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి . మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం దంచి కొడుతుంది. దీంతో ముంబైలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యయి. రాబోయే 24 గంటల్లో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని అధికారులు సూచిస్తున్నారు.
ముంబైలు కురుస్తున్న భారీ వర్షాల ధాటికి పలు సబ్ వే లను అధికారులు మూసి వేశారు.ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనారు. పలు ప్రాంతాలు కరెంట్ లేక ప్రజలు అంధకారంలో ఉండిపోయాయి. పలు రూట్లకు వెళ్లే రైళ్లు, బస్సు సర్వీసులకు తీవ్ర ఆటకం కలిగింది. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లపై వరద నీరు వచ్చి చేరింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్డీఆర్ఎప్ దళాలను అప్రమత్తం చేసింది. ఇంక భారీ వర్షాలు క్రమంలో ముంబైతో పాలు పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆదేశించారు. రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరిక జారీ అయింది. భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్నించి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
People walk on waterlogged street near Andheri Subway at Andheri in Mumbai.
(Photos: Vijay Bate/ HT Photos)
Track updates: https://t.co/LJJ1lbUouj#MumbaiRains pic.twitter.com/CSQkqOzWul
— Hindustan Times (@htTweets) July 5, 2022
#InPics | Several parts of the country witnessed heavy rain amid #monsoon arrival. #Mumbai faced severe waterlogging and heavy traffic congestion as the maximum city faced heavy downpour#MumbaiRains pic.twitter.com/l7TM8QPUg2
— HTMumbai (@HTMumbai) July 5, 2022