పెళ్లిళ్లు, ఫంక్షన్లలో హుషారుగా తిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిన వారిని టీవీల్లో, సోషల్ మీడియా వేదికల్లో చూశాం. అలాగే జిమ్, సినిమా, ఆట పాటల సమయంలో యువత చనిపోవడాన్ని చూశాం. అంతే కాకుండా విధి నిర్వహణలో ఉంటూ.. కుర్చిలోనే కూలబడిన అధికారుల గురించి విన్నాం. ఇటువంటి సంఘటనలెన్నో ఇటీవల చూస్తూనే ఉన్నాం.
గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. అప్పటి వరకు ఆడుతూ, పాడుతూ, తుళ్లుతూ కనిపిస్తున్న వారు.. ఒక్కసారిగా గుండెపోటుకు గురై చనిపోతున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో హుషారుగా తిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిన వారిని టీవీల్లో, సోషల్ మీడియా వేదికల్లో చూశాం. అలాగే జిమ్, సినిమా, ఆట పాటల సమయంలో యువత చనిపోవడాన్ని చూశాం. అంతే కాకుండా విధి నిర్వహణలో ఉంటూ.. కుర్చిలోనే కూలబడిన అధికారుల గురించి విన్నాం. ఇటువంటి సంఘటనలెన్నో ఇటీవల చూస్తూనే ఉన్నాం. కరోనా అనంతర పరిస్థితులు ఇలానే ఉంటాయని చెప్పుకుంటున్నప్పటికీ.. ఎక్కడో ఓ చోట భయమనేది మొదలైంది. మనిషి జీవితం తామరాకు వంటి నీటి బొట్టులా మారిందని తెలిసి.. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యవంతులు కూడా ఈ గుండె పోటుకు గురౌతున్నారు తాజాగా విధుల్లో ఉండగానే ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది.
చాక చక్యంగా కండక్టర్ వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. అసలేమైందంటే.. కలబురగి జిల్లాకు చెందిన మురిగెప్ప అథాని కేఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులకు హాజరయ్యారు. అప్జల్‌పూర్ నుంచి విజయపురకు ప్రయాణీకులతో బస్సు బయలు దేరింది. మార్గమధ్యంలో హెడ్ లైట్ సమస్యతో బస్సు ఆగిపోయింది. దీంతో బస్సును నడపడం సాధ్యం కాదని భావించిన డ్రైవర్.. ప్రయాణీకులను దించేసి..మరో బస్సులో ఎక్కి వెళ్లాలని సూచించారు. బస్సును సిందగి డిపోకు తరలించేందుకు బస్సులో బయలు దేరారు. అంతలో మురిగెప్పకు అనారోగ్యానికి గురయ్యారు. గుండె పోటుతో విలవిలలాడుతూ.. సీట్లోనే మృతి చెందాడు. బస్సులో కండక్టర్ ఒక్కరే ఉన్నారు. బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది.
అప్పటి వరకు మాట్లాడిన డ్రైవర్ ఒక్కసారిగా కింద పడిపోయే సరికి బస్సు కండక్టర్ శరణు తకాలి తక్షణమే స్పందించి.. బస్సును బ్రేక్ వేసి ఆపేశాడు. కండక్టర్ సమయ స్పూర్తితో వ్యవహరించడంతో పాటు బస్సులో ప్రయాణీకులెవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. లేదంటే ఊహకందని ప్రమాదం జరిగేది. సమాచారం అందుకున్న అప్జల్‌పూర్ డిపో సిబ్బంది బస్సు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన సిందగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కండక్టర్ తక్షణమే స్పందించకపోయి ఉంటే.. రోడ్డుమీద జనాలతో పాటు బస్సులో ఉన్న అతడికి కూడా ప్రమాదం జరిగేది.