విహార యాత్రలకు వెళ్లినపుడో లేక జాతర్లకు పోయినపుడో పిల్లలు తప్పిపోయిన సంఘటనలు మనం చూస్తూంటాం. తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికి పిల్లలు తప్పిపోతుంటారు. అలా తప్పిపోయిన పిల్లలు కొన్నేండ్లు గడిచిన తరువాత తిరిగొస్తే ఆ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధుల్లేకుండా పోతుంది. అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి ఒడిషాలోని పర్లాఖెముడిలో చోటుచేసుకుంది.

12 ఏళ్ల ప్రాయంలో మోహన సమితిలోని లుహగుడి గ్రామానికి చెందిన గోవర్థన్ లాహ్రా అనే బాలుడు పని కోసం మధ్యప్రదేశ్ వెళ్లాడు. అక్కడ ఓ కర్మాగారంలో పనిచేశాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. పనిచేస్తున్నాడు కాని పైకం తక్కువ రావడంతో పని వదిలేశాడు. దాంతో తనకు మళ్లీ పని చేద్దామంటే వేరే పని దొరకలేదు. దీంతో చేసేదేం లేక ఇంటికి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తను రైలెక్కి సొంత ఊరుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో రైల్లో తనిఖీలు చేపట్టిన టీటీ, గోవర్ధన్ దగ్గర టికెట్ లేదని గుర్తించాడు. దీంతో టీటీ ప్రయాణం మధ్యలోనే నాగపూర్ స్టేషన్ లో దించేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో గోవర్థన్ రైల్వే స్టేషన్ లో కాలం గడపసాగాడు. సుమారు 15 రోజులు స్టేషన్ లోనే ఉన్న గోవర్థన్ ను అక్కడి స్థానికులు చేరదీశారు. తన ఆరోగ్య బాలేకపోతే ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే అక్కడే స్థానికంగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి గోవర్థన్ ను తీసుకెళ్లి ఓ హోటల్ లో పనికి పెట్టాడు. ఇక అప్పటినుంచి అదే హోటల్ లో పనిచేస్తూ, అక్కడి అమ్మయిని పెళ్లి చేసుకున్నాడు. తనకు ఇద్దరు కూతుర్లు జన్మించారు. అలా జీవితం సాగిపోతున్నది. ఈ లోగా కూతుర్లు కూడా పెళ్లీడుకొచ్చారు. వారికీ వివాహాలు చేశాడు. ఇంత కాలం తరువాత తనకు తోబుట్టువులను చూడాలనిపించింది. వెంటనే తన భార్యతో సహా కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని సొంతూరుకు బయల్దేరాడు. బాల్యదశలో వెళ్లిపోయిన వ్యక్తి మళ్లీ ఇన్నేండ్ల తరువాత గ్రామానికి తిరిగి రావడంతో గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. తోబుట్టువులను అయిన వారిని కలుసుకుని ఆనందంలో మునిగిపోయారు.