బెంగాలీ బుల్లితెరలోని ఓ ప్రముఖ నటికి వేధింపులు ఎదురవుతున్నాయి. ఓ డైరెక్టర్ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ వేధింపులకు గురి చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇక పూర్తి వివారాల్లోకి వెళ్తే.. బెంగాలీ బుల్లితెర నటి నటి పాయల్ సర్కార్. తపూర్ తుపూర్, అందర్ మహల్, బెనెబౌ, తమీ రబే నిరోబ్ వంటి సీరియల్ లో నటించి మంచి నటిగా దూసుకుపోతోంది.
ఇక ఉన్నట్టుండి ఆమెకు ప్రముఖ డైరెక్టర్ రవి కినాగి నుంచి ఫ్రెండ్ రిక్వస్ట్ వచ్చింది. దీంతో కొన్నాళ్లకు ఈ రిక్వస్ట్ ను ఆక్సెప్ట్ చేసింది. అక్కడ నుంచి మెల్ల మెల్లగా మాటా మాటా కలుపుతూ ముగ్గులోకి దింపే ప్రయత్నం చేశారు. ఆ డైరెక్టర్ ఖాతా నుంచి ఒక్కొక్కటి అసభ్యకరమైన మెసెజ్ లు వెళ్తున్నాయి. దీంతో ఖంగుతిన్న పాయల్ సర్కార్ వచ్చిన మెసెజ్ లను స్క్రీన్ షాట్ తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ మెసెజ్ లను చూసిన ఆమె స్నేహితులు, అభిమానులు అది ఫేక్ అకౌంట్ అని గుర్తించారు.
దీంతో స్పందించిన ఆ నటి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ ఖాతాతో హల్చల్ చేస్తున్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో డైరెక్టర్ రవి కినాగి మేలుకుని ఇలాంటి నకిలీ ఖాతాలో వేధింపులకు గురి చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించేలా తాను కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.