దేశంలో కొంత మంది మత విద్వేశాలు రెచ్చగొడుతూ అన్నదమ్ముల్లా ఉంటున్న వారి మద్య చిచ్చుపెడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగ హనుమాన్ జయంతి నిర్వహించారు. ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న శోభాయాత్రలో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని జహంగిర్‌పూరి ప్రాంతంలో ఊరేగింపు జరుగుతున్న సమయంలో కొంత మంది దుండగులు రాళ్లు విసరడంతో పెద్ద గొడవ అయ్యిందని పోలీస్ అధికారి తెలిపారు.
ఈ దాడిలో కొంత మంది పోలీసులకు కూడా గాయాలు అయ్యాయని.. రాళ్ల దాడిలో పలు వాహనాలు, దుకాణాలు ద్వంసం అయ్యాయని పోలీసులు తెలిపారు. కొంత మంది దుండగులు రెచ్చిపోయి వాహనాలకు నిప్పు పెట్టారని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. సిసీ ఫుటేజ్ పరిశీలించి నింధితులను పట్టుకుంటామని ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీలో పోలీస్ భద్రతను మరింతగా పెంచామని.. ప్రస్తుతానికి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు ఏమీ జరగలేదని, పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు కమిషనర్‌తో మాట్లాడారు. ఎలాంటి వారైనా సరే నింధితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలకు ముందస్తుగా పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడానని సూచింనట్లు తెలుస్తుంది.