ఈ మద్య కాలంలో యువతులు మద్యం మత్తులో రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కారణాలే ఏవైనా ఇలా రోడ్లపై కి వచ్చి అమ్మాయిలు రబస చేయడం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల యువత మద్యం మత్తులో ఊగిపోతుంది. అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా మద్యం మత్తులో రోడ్లపై యువత తెగ హల్ చల్ చేస్తున్నారు. చిత్తుగా తాగి తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ లేకుండా ఎదుటివారిపై దాడులు చేయడం, దూషించడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ఓ యువతి మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం సృష్టించింది. ఈ ఘటన గ్వాలియర్ లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో అత్యంత రద్దీగా ఉండే కూడలిలో ఓ యువతి చిత్తుగా తాగి హై డ్రామా క్రియేట్ చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు చేరుకుని సిగ్నల్ వద్ద పార్క్ చేసిన కారుపైకి ఎక్కి కొద్దిసేపు డ్యాన్స్ చేసింది. ఆ తర్వత ఓ వృద్ధుడిని ఆపి అతడి యాక్టివా బండిపై కూర్చుని హంగామా చేసింది. కొద్ది సేపటి తర్వాత సిగ్నల్ వద్దకు వచ్చి గొడవ చేసింది. బారికేట్ ని తొసి కింద పడేసింది. ఇలా నానా హంగామా చేసిన తర్వాత పోలీసులు రావడంతో తన బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడని.. అతనిగో గొడవపడి ప్రెస్టేషన్ లో ఇలా చేస్తున్నానని చెప్పింది. అప్పటికే ఆ యువతి పీకల దాకా తాగి ఉండటం వల్ల ఇలా చేసిందని స్థానికులు అంటున్నారు. యువతిని పోలీసులు అదుపోలకి తీసుకున్నారు. మద్యం మత్తులో యువతి చేసిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ యువతి మద్యం మత్తులో ఆటో డ్రైవర్ పై దాడికి పాల్పపడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ నుంచి గోదావరిఖని కి వెళ్లేందుకు ఆటో రూ.1200 లకు మాట్లాడుకుంది ఓ యువతి. మార్గ మధ్యలో డీజిల్ కొట్టించుకోవాలని డబ్బు ఇవ్వాలని ఆటో డ్రైవర్ అడిగితే.. తనా గోదావరిఖనికి వెళ్లాక ఇస్తానని చెప్పింది. తీరా గమ్యస్థానానికి వెళ్లాక డబ్బులు ఇవ్వను లేవని బెదిరించింది. పైగా ఇష్టమొచ్చినట్లు ఎలా పడితే అలా దుర్భాషలాడింది.. దాడి కూడా చేసింది. స్థానికులు కలుగజేసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువతితో ఆటో డ్రైవర్‌కు డబ్బులు ఇప్పించి పంపించివేయడంతో గొడవ సర్ధుమణిగింది.