రోడ్డు పక్కన ఉండే పూల కుండీలను దొంగతనం చేయడం గురించి వినే ఉంటారు. అయితే పూలకుండీలను ధనవంతులు చోరీ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..!
ధనవంతులు బాగా హుందాగా ప్రవర్తిస్తారని అనుకుంటాం. కార్లు, బంగ్లాలో ఉండేవాళ్లు తమ సంపద, హోదాకు తగ్గట్లు నడుచుకుంటారని భావిస్తాం. కానీ ఎన్ని డబ్బులున్నా, ఖరీదైన కార్లు ఉన్నా కొందరు మాత్రం తమ దుర్బుద్ధిని, లోభితనాన్ని బయటపెట్టుకుంటారు. కొన్నిసార్లు మాటల ద్వారా, మరికొన్ని సార్లు చర్యల ద్వారా తమ బుద్ధి ఏంటో చాటుకుంటారు. అలాంటి ఘటనల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి మరో ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇద్దరు సంపన్నులు పూలకుండీలు దొంగతనం చేస్తూ వీడియోకు అడ్డంగా దొరికిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది జీ20 సమ్మిట్ న్యూఢిల్లీలోని గురుగ్రామ్‌లో జరగనుంది.
మార్చి 1 నుంచి 14 వరకు జరిగే జీ20 మీటింగ్‌లో వివిధ దేశాలకు చెందిన చాలా మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశం కోసం గురుగ్రామ్ అధికారులు అన్ని రకాలు ఏర్పాట్లను పూర్తి చేశారు. సమ్మిట్ జరిగే హోటల్స్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్లను సుందరంగా అలంకరించారు. చాలా చోట్ల కుండీల్లో పూల మొక్కలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన పూలకుండీల్లో కొన్నింటిని రూ.40 లక్షల విలువైన ఖరీదైన కియా కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పూలకుండీలను కారు డిక్కీలో పెట్టుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై గురుగ్రామ్ అధికారులు స్పందించారు. పూలకుండీలు ఎత్తుకెళ్లిన వారి మీద చర్యలు తీసుకుంటామన్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A rich man in an expensive car stealing flower pots kept for G20 program in Gurugram
He might have bought that car by doing such honest things 😂pic.twitter.com/op4hxxmqZf— Swathi Bellam (@BellamSwathi) February 28, 2023