మనుషులు ఎంతో ఇష్టంగా పెంచుకునే సాదు జంతువుల్లో ఒకటి కుక్క. ఒక్కసారి మనతో బంధం ఏర్పడితే చచ్చేంత వరకు విశ్వాసంతో ఉంటుంది. కుక్కలను చాలా మంది ఇంటి కాపలా కోసం పెంచుకుంటుంటారు. కొంతమంది వాటిని తమ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు.. వాటికి ఏ చిన్న బాధ కలిగినా విల విలాడిపోతారు. ఇక అవి చనిపోతే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు చనిపోయినంతగా బాధపడతారు. ఏ ఇతర జంతువులకు లేని సాన్నిహిత్యం కుక్కలతో మనుషులకు ఉంటుంది. ఈ మద్య కొంతమంది ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. పెంపుడు కుక్కలకు హిందూ సాంప్రదాయ పద్దతిలో ఘనంగా పెళ్లి జరిపించారు వాటి యజమానులు. ఈ ఘటన హర్యాణాలో చోటు చేసుకుంది.
గురుగ్రామ్ కి చెందిన రాణి అనే మహిళ తనకు పిల్లలు లేకపోవడంతో ఎన్నో గుళ్లూ..గోపురాలు తిరిగింది. ఇటీవల ఓ గుడికి వెళ్లి వస్తుండగా ఒక చిన్న కుక్కపిల్ల తన భర్త వెంట వచ్చిందని.. అప్పటి నుంచి ఆ కుక్కపిల్లకు స్వీటీ అని పేరు పెట్టుకొని తమ సొంత బిడ్డలా సాదుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన కుక్కపిల్ల స్వీటీకి పెళ్లి చేయాలని ఆలోచన రావడంతో తమకు తెలిసిన వాళ్లను సంప్రదించింది. అదే కాలనీలో ఉంటున్న మనితా అనే మహిళను కలిసి తన మనసులోని మాట చెప్పింది. మనితా పెంచుకుంటున్న మగ కుక్క పేరు షేరూ. ఆమె కూడా సంతోషంగా పెళ్లికి అంగీకరించడంతో హిందూ సాంప్రాదాయ ప్రకారం రెండు కుక్క పిల్లలకు పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు
బంధుమిత్రులకు ఆన్ లైన్, ఫోన్ ద్వారా ఆహ్వానం పంపించారు. వివాహ వేడుకకు వచ్చిన అతిథుల సమక్షంలో రెండు కుక్కలకు బాజా భజంత్రీల మద్య ఘనంగా పెళ్లి చేశారు. వీటికి హల్దీ వేడుకులు సైతం నిర్వహించారు ఇరు కుటుంబ సభ్యులు. తమకు పిల్లలు లేని లోటు స్వీటీ ద్వారా తీర్చుకున్నామని రాణి సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు కన్యాదానం చేసే సమయంలో కన్నీరు కూడా పెట్టుకుంది. అయితే ఇక్కడ కాలనీ స్థానికులు రెండు కుక్కల వివాహ విషయం గురించి తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వినడానికి ఇది వింతగా ఉన్నా తాము మాత్రం తమ సొంత బిడ్డలుగా భావించి వివాహం జరిపించామని అంటున్నారు రెండు కక్కల యజమానులు.
‘Sheru Te Sweety Di Wedding’: Neighbours in Gurugram to get their dogs married
Read @ANI Story | https://t.co/iRmRu5mbdP#Pet #Wedding #marriage #Dogs pic.twitter.com/UjpnqURUTH
— ANI Digital (@ani_digital) November 12, 2022