ఆ యువకుడ్ని ఆ ఇద్దరు యువతులు నడిరోడ్డుపై పడేసి విచక్షణా రహితంగా కొట్టసాగారు. అతడు దెబ్బలు తిన్నాడే తప్ప వారిని తిరిగి కొట్టే ప్రయత్నం చేయలేదు.
తమను వేధింపులకు గురిచేస్తే ఆడపిల్లలు మౌనంగా భరించే రోజులు పోయాయి. తమతో తప్పుగా ప్రవర్తించే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు ఈ కాలం ఆడపిల్లలు. తాజా సంఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఓ యువకుడు.. అక్కాచెల్లెళ్ల వెంట పడి ప్రతీ రోజూ వేధిస్తున్నాడు. వారు కొన్ని రోజులు అతడి వేధింపులు మౌనంగా భరించారు. వారి మౌనాన్ని అలసుగా తీసుకున్న అతడు మరింత ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆ ఇద్దరూ కలిసి ఆ యువకుడికి నడిరోడ్డుపై బుద్ధి చెప్పారు.
ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌కు విజయ్ సర్కారే గత కొద్దిరోజుల నుంచి ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్ల వెంట పడి వేధిస్తున్నాడు. రోజూ వారి వెంట పడి లైంగికంగా ఇబ్బంది పెట్టేవాడు. ఓ రోజు అక్కాచెల్లెళ్లలోని ఓ యువతిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. దీంతో వారి కోపం కట్టలు తెంచుకుంది. నడిరోడ్డుపై అతడిపై తిరగబడ్డారు. అపరకాళికల్లా మారి విజయ్‌పై దాడికి దిగారు. వీరికి రోడ్డుపై వెళుతున్న వారు కూడా సాయం వచ్చారు.
ఇక, ఇద్దరూ ఇష్టం వచ్చినట్లు ఆ యువకుడిని రోడ్డుపై పడేసి కొట్టారు. అక్కాచెల్లెళ్లలోని ఓ అమ్మాయి అతడ్ని బెల్టుతో విచక్షణా రహితంగా కొట్టింది. అతడు దెబ్బలు తిన్నాడే తప్ప ఎదురు తిరగలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఈ కాలంలో ఆడపిల్లలు ఇలా ఉంటేనే బతుకుతారు’’.. ‘‘ అలాంటి వెధవలకు అలానే బుద్ది చెప్పాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Female students confront harasser, beat him with belts in Ahmedabadhttps://t.co/ttoSnTw06H pic.twitter.com/b4WMzsXwbl
— DeshGujarat (@DeshGujarat) June 23, 2023