ప్రపంచంలో ఎంతో మంది తమ అద్భుతమైన గానంతో కోట్ల మంది అభిమానులను అలరిస్తుంటారు. మన దేశంలో చాలా మంది జానపత గాయనీగాయకులు తమ అద్భుతమైన పాటలతో ఎంతో మంది మనసు దోచుకుంటున్నారు. వారి పాటలకు తన్మయత్వంలో కొన్నిచోట్ల అభిమానులు నోట్ల వర్షం కురిపిస్తుంటారు.
సంగీతం ఒక మ్యాజిక్.. సంగీతాన్ని మించిన ఆనందం లోకంలో ఏదీ ఉండదు. సంగీతానికి పశు పక్షాదులు తన్మయత్వంలో మునిగిపోతాయి. మధరమైన గానం వింటే ఎలాంటి వారైనా లోకాన్ని మర్చిపోతుంటారు. తమ గానంతో కోట్ల మందిని అలరిస్తున్నారు పాపులర్ సింగర్స్. మనసుకు హత్తుకునేలా పాటలు వింటూ తన్మయత్వంలో పరవశించిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది సింగర్స్ పాటలకు హర్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు.. వారి పాటలు వింలే ఆనందంతో ఉప్పొంగిపోతుంటారు.. నోట్ల వర్షం కురిపిస్తుంటారు. తన పాటలతో కోట్ల మంది హృదయాలను గెల్చుకున్న జానపద గాయని గీతా రాబరి. మధురమైన పాటలకు రాళ్లు కరుగుతాయో లేదో తెలియదు కానీ.. గీతా రబారీ పాడితే మాత్రం మనసు కరగాల్సిందే అంటారు. తాజాగా ఆమె పాడిన పాటకు నోట్ల వర్షం కురిపించారు అభిమానులు. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ కి చెందిన ప్రముఖ జానపద గాయని గీతా బెన్ రబారీ. ఈ గాయని పేరు దేశంలో తెలియని వారు అంటూ ఉండరు. పాట కోసమే పుట్టారా అన్నంత మధురమైన గానంతో కోట్లమంది సంగీత ప్రియులను అలరిస్తున్నారు. స్టేజ్ పై ఆమె పాటలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ఆమె పాడటం మొదలు పెడితే ప్రజలు తన్మయత్వంలో మునిగిపోతుంటారు. గీతా రబారి.. రాన్ ఆప్ కచ్ జిల్లాలో తప్పర్ గ్రామంలో జన్మించింది. 5వ తరగతి వరకు చదివిన ఆమె చిన్నప్పటి నుంచి జానపద గీతాలు పాడటం మొదలు పెట్టింది. గీతా రాబరి గుజరాతీ భాషలో ఎక్కువగా భజనలు, జానపద పాటలు పాడతారు. అక్కడ ఆ పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి.
గుజరత్.. రాన్న్ ఆఫ్ కచ్ లో నాందేవి మాత పునర్జన్మను పురస్కరించుకొని బనస్కాంత జిల్లాలో నవచండీ యజ్జం జరిపించ రాత్రంతా సంగీత భజనా కార్యక్రమంలో గీతా రాబారి పాడారు. ఈ సందర్భంగా స్టేజ్ పై అభిమానులు ఏకంగా రూ.4 కోట్ల 50 లక్షల నోట్ల వర్షం కురిపించారు. గీతా రబారీ తన కచెరీకి వచ్చిన డబ్బుతో పేదల ప్రజలను ఆదుకుంటారు. ఆ మద్య రష్యాదాడిలో సర్వం కోల్పోయిన ఉక్రెయిన్ ప్రజలను ఆదుకునేందుకు తన వంతు సహాయంగా అమెరికాలో ఓ సంగీత కచేరీలో పాలుపంచుకున్నారు. దీని ద్వారా రెండు కోట్లకు పైగా నిధులు పొగు చేసి ఉక్రెయిన్ కి సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. తాజాగా ఆమెపై నోట్ల వర్షం కురిపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.