ఈ మధ్యకాలంలో గుండెపోటు కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. అంతసేపు ఎంతో సంతోషంగా గడిపిన వారు కూడా.. ఉన్నట్లుండి గుండెపోటుకు గురయ్యి.. హఠాన్మరణం పొందడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. డ్రైవర్‌కు ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో.. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. 28 మంది గాయపడ్డారు. ఆ వివరాలు..
గుజరాత్ నవసారీ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్‌యూవీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. దాంతో ప్రమాదం చోటు చేసుకుంది. వెస్మా గ్రామలో శనివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులు.. సూరత్‌లో నిర్వహించిన ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవ్‌లో పాల్గొని తిరిగి వస్తున్నారు. వీరంతా టొయాటా ఫార్చునర్‌లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్‌యూవీ డ్రైవర్‌కు ఉన్నట్లుండి గుండెపోటు వచ్చింది. దాంతో కంట్రోల్ తప్పి.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు.
ఈ క్రమంలో ఎస్‌యూవీలోని 10 ప్రాణాలు కోల్పోగా.. బస్సులోని 28 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరందరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఎస్‌యూవీలో ప్రయాణించిన వారు అంకలేశ్వర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా వస్లాద్ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి.. సహాయక చర్యలు ప్రారంభించారు.