భారత్ లో జరుగుతున్న అత్యాచారాలపై కొందరు నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆలానే తాజాగా గుజరాత్ హోంమంత్రి దేశంలో లో అత్యాచారాలపై సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు ఫోన్లే కారణం అంటూ గుజరాత్ హోం మంత్రి, బీజేపీ నేత హర్ష్ సంఘవి ఆరోపించారు. ఇప్పుడు హర్ష్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.
గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఓ కార్యక్రమంలో హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోన్ల్ అశ్లీల వీడియో సులభంగా వచ్చేస్తున్నాయని, వీటికి సంబంధించిన కంటెంట్ భారత్ లో చాలా అందుబాటులో ఉందన్నారు. ఈ అశ్లీల వీడియోలు కొందరిలో చెడుబుద్దికి ప్రేరణగా మారుతున్నాయంటి వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి విజృభిస్తున్న సమయంలో కూడా దేశంలోని అశ్లీల సైట్‌ల వీక్షకుల సంఖ్య 95 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయని హోం మంత్రి సంఘవి పేర్కొన్నారు.దేశంలో అత్యాచారాలు ఎక్కువగా జరగడానికి మొబైల్ ఫోన్లు, తెలిసిన వ్యక్తులే కారణమని ఇటీవల జరిగిన సర్వేలో వెల్లడైనట్లు హర్ష్ సంఘవి తెలిపారు. కుమార్తెపై ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడితే.. ఆ తప్పు పోలీసులది కాదని.. ఇందుకు కారణం ఆ తండ్రి చేతిలోని సెల్‌ఫోన్ అంటూ హోం మంత్రి హర్ష్ పేర్కొన్నారు. మన దేశంలో గుజరాత్ అత్యంత సురక్షితమైనదని.. అయినప్పటికీ ఒకటి, రెండు సంఘటనలు జరిగిన కూడా మనకు మంచిది కాదంటూ అభిప్రాయపడ్డారు. ఈ మంత్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.