కుక్క అంటే విశ్వాసానికి ప్రతి రూపం. మానవ పరిణామ క్రమం ప్రారంభమైన నాటి నుంచి కుక్కలు మనుషులకు అత్యంత నమ్మకైన, విశ్వాసం కలిగిన జీవులుగా ఉంటున్నాయి. కుక్కకు, మానవునికి మైత్రి పూర్వ కాలం నుంచి ఉంది. ఇక కష్ట కాలంలో మనిషికి.. మనిషి తోడుగా నిలవని వేళ కుక్క మాత్రం యజమాని వెంటే నిలుస్తుంది. అలాంటి కుక్కలు కొన్ని సందర్భాల్లో మనుషుల మాదిరే కొన్ని పనులు చేస్తాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు మనం మనిషికి మరో మనిషి రక్తదానం చేయడం గురించి విన్నాం. కానీ ప్రాణాపాయంలో ఉన్న కుక్కు.. మరో కుక్కకు రక్త దానం చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదా అయితే ఇది చదవండి.
ఈ అరుదైన సంఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది. వాడి ప్రాంతానికి చెందిన శ్వేత దూబే వద్ద 23 కుక్కలు ఉన్నాయి. సమీపంలోని ఓ శునకానికి అత్యవసరంగా రక్తం కావాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న శ్వేత.. వెంటనే తన శునకాన్ని తీసుకెళ్లి రక్త దానం చేయించింది. జంతు ప్రేమికురాలైన ఆ యువతి.. కుక్కల కోసం వడోదరలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కోరింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.