ఒక యువతి పెళ్లి వేడుకలో చేయకూడని తప్పు చేసింది. ఈ కారణంగా వరుడికి అతి ముఖ్యమైన ఘట్టం మిస్ అయ్యింది. తన భార్య కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసి బాధపడడం ఆ పెళ్లి కొడుకు వంతు అయ్యింది.
పెళ్లి వేడుకల్లో విషాదాలు చోటు చేసుకోవడం మామూలే. పెళ్లయ్యాక విషాదం చోటు చేసుకుంటే తదుపరి ఘట్టం పోస్ట్ పోన్ అవుతుంది. అయితే ఇక్కడ పాపం పెళ్లి కొడుకు ఎదురుచూస్తున్న శోభనం రాత్రి వేడుక ఆగిపోవడానికి కారణం మాత్రం పెళ్లి కూతురే. ఒక యువతి ఒక యువకుడ్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి కొడుకు తదుపరి ఘట్టం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ పెళ్లి కూతురు చేయకూడని పని చేసి.. చివరకు తనను పోలీసులు గాలించే పరిస్థితి తెచ్చుకుంది. పెళ్లి వేడుకలో వేదిక మీద వరుడు పక్కన ఉండగా.. తుపాకీతో కాల్పులు జరిపింది. దాన్ని బంధువులు వీడియో తీయగా అది కాస్తా వైరల్ గా మారింది. ఏకంగా పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆమె భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో పెళ్లి వేడుకల్లో గన్ ను ఉపయోగించే కల్చర్ ఉంది. తుపాకీని గాల్లో పెట్టి కాల్పులు జరుపుతూ సంబరాలు చేసుకోవడం అక్కడి వారి ఆనవాయితీ. అయితే ఈ కాల్పుల్లో పొరపాటున ఎవరైనా చనిపోవడం, ప్రమాదానికి గురవ్వడం గానీ, గాయాలు పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి భారత చట్టాల ప్రకారం గన్ వాడకం నిషేధం. ఎవరైనా తుపాకీని నిర్లక్ష్యంగా వాడినా వేడుకల్లో సంబరాల సాకు చూపించి కాల్పులు జరిపినా జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అయితే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక మహిళ పెళ్లి వేడుకలో తుపాకీతో నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపింది.
పెళ్లి కూతురు పెళ్లి వేదికపై వరుడి పక్కన కూర్చుని గాల్లోకి నాలుగు రౌండ్లు తుపాకీతో కాల్పులు జరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారని తెలిసినప్పటి నుంచి ఆ పెళ్లి కూతురు కనబడడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అరెస్ట్ చేస్తారనే భయంతో పెళ్లి కూతురు పారిపోయిందని పోలీసులు వెల్లడించారు. దీంతో పాపం కొత్త వరుడి జీవితంలో చీకట్లు అలుముకున్నాయి. ఒక తుపాకీ వరుడి జీవితంతో ఇలా ఆడుకుంటుందని అతను అనుకుని ఉండకపోవచ్చు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Hathras, U.P., 2023#WomenEmpowerment #ABLANARI
Are Indians without a gun licence allowed to use guns @Uppolice @kpmaurya1 @myogiadityanath @dgpup @hathraspolice @dm_hathras ⁉️
Please investigate such incidents@NCMIndiaa @realsiff @Das1Tribikram @RajNgc @KirenRijiju pic.twitter.com/UFgJRgowWT
— Lady Of Equality 🇮🇳 (@ladyofequality) April 9, 2023