కాలం మారినా, తరాలు మారినా దేశంలో ఎక్కడో అక్కడ దళితులపై జరిగే దాడులు మాత్రం ఎక్కడో ఓ చోట కొనసాగుతూనే ఉన్నాయి. కులం పేరుతో మతం పేరుతో గొడవలు జరుతూనే ఉన్నాయి.
దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ది సాధిస్తుంది. ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీ పడుతూ వైద్య, విజ్ఞాన రంగాల్లో దూసుకు పోతుంది. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు, అగ్ర కులం, చిన్న కులాలు అంటూ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల చిన్నకులాల వారిపై దాడులు జరుగతూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. దేశంలో కులాల వ్యవస్థ ఎక్కడా మారలేదనే చెప్పాలి. నాగరికతతో ఎంతో మార్పు సాధించినప్పటికి మనుషుల్లో మాత్రం కుల వివక్ష పోలేదు. ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకొని వస్తున్న ఓ దళిత వరుడిపై కొంతమంది దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా నగరంలో సోహల్లా ప్రాంతంలో మే 4న రాత్రి దళిత వర్గానికి చెందిన అజయ్ కుమార్ (22) వివాహం జరిగింది. వివాహానంతరం పెద్ద ఎత్తున భారాత్ సాగింది.. ఈ సందర్భంగా అజయ్ కుమార్ గుర్రంపై ఊరేగిస్తున్నారు. అందరూ హ్యాపీగా ముందుకు సాగుతున్న సమయంలో హఠాత్తుగా కొంతమంది అక్కడికి వచ్చి వరుడిపై రాళ్లతో దాడి చేశారు. గుర్రంపై నుంచి కిందకు లాగి రాళ్లు, రాడ్లు, కర్రలతో కొట్టారు. పెళ్లి మండపంలో ఉన్న వధువుపై కొంతమంది మగాళ్లు దాడికి దిగారు. మహిళను కులం పేరుతో దూషించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం వరుడి అత్త గీతాదేవి ఫిర్యాదు చేయడంతో నిందితుల మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ సందర్భంగా గీతాదేవి తన ఫిర్యాదులో తన అల్లుడిపై కొంతమంది దారుణంగా దాడికి పాల్పపడ్డారని.. వారంతా మండపంలో ఉన్న ఆడవారిపై దాడులు చేయడమే కాదు.. కులం పేరుతో దూషిస్తూ.. దళితులకు ఇంత పొగరా అంటూ తిట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లిలో విద్యుత్ సరఫరా సైతం మూడుసార్లు నిలిపి వేశారని, ‘మా ఊరిలో దళిత పెళ్లికొడుకులు గుర్రాలు ఎక్కరు, నీకు ఎంత ధైర్యంరా?’ అంటూ ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. వాళ్లు చేసిన బీభత్సానికి వివాహానికి వచ్చిన అతిధుల్లో కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీస్ ఆఫీసర్ నీరజ్ శర్మ మాట్లాడుతూ.. ఇలాంటి దాడి జగరడం శోచనీయం అన్నారు.. నలుగురు నిందితులతో పాటు పలువురు గుర్తు తెలియని వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ చట్టం, తో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.