మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉండే మనదేశంలో ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి అంటే ఎవరకి ఆశ ఉండదండి. అందుకే ఈ శుభవార్తను మీకు తెలియజేస్తున్నాం. మీరు కూడా పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులైతే.. ఇది మీకు ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకుంటే.. కేంద్ర ప్రభుత్వం ఈ దీపావళి పండుగను మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు సిద్ఠమవుతోంది. పీఎం కిసాన్ 12వ విడత డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనుంది. ఆ వివరాలు.. కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. 12వ విడత పీఎం కిసాన్ నిధులు 2022 అక్టోబర్ 17, 18 తేదీల్లో ఎప్పుడైనా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావొచ్చని తెలుస్తోంది.
ఢిల్లీ వేదికగా 2022 అక్టోబర్ 17, 18 తేదీలలో అగ్రి-స్టార్టప్ కాన్క్లేవ్ మరియు కిసాన్ సమ్మేళన్ జరగాల్సి ఉంది. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోడీ పీఎం కిసాన్ 12వ విడత నిధులను కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే.. రైతులు ఈ డబ్బులు కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి, ఈసారి e-KYC కారణంగానే.. నిధులు విడుదలలో జాప్యం జరిగింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా 6 వేల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు విడతలుగా, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో 11 విడతల నగదు జమ అయ్యింది. అయితే.. 12వ విడత డబ్బులు పొందడానికి e-KYC తప్పనిసరి చేసింది కేంద్రం. ఆగస్టు 31తో గడువు ముగియగా.. ఆనాటి వరకు e-KYC పూర్తి చేసిన వ్యక్తులు మాత్రమే 12వ విడత డబ్బును పొందనున్నారు.
PM Kisan Samman Nidhi: Before Diwali, the government gave good news to the farmers, the money for the 12th installment will come soon https://t.co/DSJk9xmaDX
— Comp Studio (@compstudio_in) October 7, 2022
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది. మీరు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దరఖాస్తు చేసుకున్నట్లయితే, దాని స్థితిని తెలుసుకోవడానికి ఈ నెంబర్ కు 155261 కాల్ చేయవచ్చు. దీని గురించి అన్ని రకాల సమాచారాన్ని పొందవచ్చు.