ప్రస్తుతం సామాన్యుడు బయటికి వెళ్లి ఏది కొన్నాలన్నా భయపడే పరిస్థితి నెలకొంటుంది.. గత ఏడాదితో పోలిస్తే నిత్యవాసర సరుకుల ధరలు చుక్కలనుంటుతున్నాయి. దానికి తోడు ఇంధన ఖర్చు, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.. దీంతో సగటు మనిషి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు.
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ప్రజలపై ఎంతగా పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు… నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో సామాన్య ప్రజలకు మోదీ సర్కార్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..
గ్యాస్ వినియోగదారులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉజ్వల యోజన కింద ప్రతి సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లపై అందుతున్న సబ్సిడీ మరో సంవత్సరం పాటు పొడగించింది. దీని వల్ల దేశ వ్యాప్తంగా 9.6 కోట్ల మందికి పైగా గ్యాస్ వినియోగదారులు ప్రతి నెల గ్యాస్ సిలిండర్ పై రూ.200 ప్రయోజనం పొందవొచ్చు. వినియోగదారులకు ఆర్థిక కష్టాలు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నామని.. దీని వల్ల ప్రభుత్వంపై రూ.7,680 కోట్ల వరకు భారం పడబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముందుగా రూ.6,100 కోట్లు ఖర్చు చేశారు. రూ.200 ప్రయోజనం పొందనున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పేద కుటుంబాల నుంచి వయోజన మహిళలకు ఉచిత ఎల్పీజీ కలెక్షన్లు అందించడానికి ప్రభుత్వం మే 2016 లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించిందని.. సామాన్యుల ఆర్థిక కష్టాలు అర్థం చేసుకొని ప్రస్తుతం అందిస్తున్న గ్యాస్ సిలిండర్లపై సబ్సీడీని మరో ఏడాది పాటు పొడగించామని.. దీని వల్ల 9.6 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.. ఈ సబ్సిడీ నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది’ అని అన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగిపోయాయి.. మార్చి నెలలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగిపోయింది. ప్రస్తుతం దేశ రాజధాని లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,103 కి చేరినట్లు వార్తలు వస్తున్నాయి.
Govt extends subsidy of Rs 200 per LPG cylinder under Ujjwala Yojana for 1 year; move to benefit 9.6 cr families: I&B Minister Anurag Thakur
— Press Trust of India (@PTI_News) March 24, 2023