మోడీ సర్కారు సామాన్యులకు శుభవార్త చెప్పింది. ఇంట్లో వాడే చాలా వస్తువులపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. దీంతో వీటి ధరలు భారీగా దిగిరానున్నాయి. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ఊరట కలిగేలా కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతోఎంతో మంది ప్రజలకు ప్రయోజనం కలగనుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. మోడీ సర్కారు తాజాగా పలు ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. జులై 1వ తేదీ నుంచి జీఎస్టీ తగ్గింపు నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. దీని వల్ల పలు ప్రాడక్ట్స్ రేట్లు భారీగా దిగి రానున్నాయని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హోమ్ అప్లయెన్సెస్ మీద జీఎస్టీని తగ్గించింది కేంద్రం. ఇంతకుముందు వీటిపై 31.3 శాతం జీఎస్టీ ఉండేది. ఇప్పుడు మాత్రం ఇది దిగువకు వచ్చింది. దీంతో టీవీలతో పాటు మొబైల్ ఫోన్స్, హోమ్ అప్లయెన్సెస్ ధరలు దిగి రానున్నాయి. 27 ఇంచుల లోపు టీవీల మీద జీఎస్టీ 31.3 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. అయితే ఇప్పుడు 32 ఇంచులు లేదా ఆ పైన సైజ్లో టీవీలు కొనేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో దీని వల్ల పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు.
తక్కువ స్క్రీన్ పరిమాణం ఉన్న టీవీలను కొనాలనుకునే వారికి మాత్రం కేంద్రం నిర్ణయంతో డబ్బులు ఆదా అవుతాయి. మొబైల్ ఫోన్ల మీదా ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. ఫోన్ల వాడకం భారీగా పెరిగిన నేపథ్యంలో వాటిపై జీఎస్టీని తగ్గించడం చాలా మందికి లాభం చేకూర్చే అంశం. మొబైల్స్ మీద ఇది వరకు జీఎస్టీ 31.3 శాతంగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 12 శాతానికి తగ్గించింది కేంద్రం. ఫోన్లు, టీవీలతో పాటు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఫ్యాన్లు, కూలర్లు, గీజర్లు లాంటి వాటి ధరలు కూడా బాగా తగ్గనున్నాయి. ఈ హోమ్ అప్లయెన్సెస్ మీద జీఎస్టీని 31.3 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఆ లెక్కన ధరల తగ్గింపు 12 శాతం వరకు ఉండొచ్చు. మిక్సర్లు, జ్యూసర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, ఎల్ఈడీ లైట్లు, వ్యాక్యూమ్ ఫ్లాస్క్ వంటి వాటి మీద కూడా జీఎస్టీ దిగి వచ్చింది. వీటిపై ఇంతకుముందు 31.3 శాతంగా ఉన్న జీఎస్టీ.. ఇప్పుడు 18 శాతానికి తగ్గింది. అలాగే ఎల్పీజీ స్టవ్ పై జీఎస్టీ 21 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది.
With reduced taxes, #GST brings happiness to every home: Relief through #GST on household appliances and mobile phones 📱🖥️#6YearsofGST #TaxReforms
#GSTforGrowth pic.twitter.com/LgjGQMbw6e— PIB India (@PIB_India) June 30, 2023