దేశానికి వెన్నెముక రైతు. ఆయన వ్యవసాయం చేసి పంటలు బాగా పండిస్తేనే మన నోటి ముద్ద దొరుకుతుంది. రైతులు వ్యవసాయ రుణాల కోసం, ప్రభుత్వం అందించే ఎరువులు, విత్తనాల కోసం అధికారుల వద్దకు వెళ్తుంటారు.అయితే కొందరు అధికారులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అయినా చాలా వరకు ఓర్పుతో ఉంటూ సార్.. సార్ అంటూ అధికారుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ రైతులు అందాల్సిన వాటిని కొందరు అధికారులు అడ్డదారులు బయటకి పంపిస్తారు. అధికారుల ఆగడాలు శృతి మించినప్పుడు రైతుల్లో ఆగ్రహాం కట్టలు తెంచుకుంటుంది. ఎరువులు నిల్వ ఉంచడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం పై ఆగ్రహం చెందిన రైతులు ఓ ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేశారు. తాజాగా ఈ ఘటన బిహార్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బిహార్ లో మోతిహారిలో వ్యవసాయశాఖలోని కిసాన్ సలహదారుడు నితిన్ కుమార్ ని రైతులు స్థంభానికి కట్టేశారు. వారి దెబ్బకు అధికారు బిత్తరపోయాడు. సంబంధించి అధికారులకు జరిగిన విషయాన్ని ఫోన్ లో తెలియజేశాడు. రైతుల ఆవేదన అర్థం చేసుకోకుండా ఎరువుల ధరలు తమ ఇష్ట రాజ్యంగా పెంచేందుకు యత్నిస్తున్న ఆ అధికారికి బుద్ధి చెప్పేందుకే ఇలా చేసినట్లు సమాచారం. ఈ కిసాన్ సలహదారుడు ఎరువుల వ్యాపారులతో చేతులు కలిపి వాటి ధర పెంచే పనిచేస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. అంతే కాక యూరియా బస్తాను ప్రభుత్వం రూ.265కి విక్రయిస్తుంటే..అదే స్థానిక ఎరువుల దుకాణాల్లో రూ.500 నుంచి రూ.600లకు తమకు విక్రయిస్తున్నారని రైతులు వాపోయారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయి.. చివరకు ఉన్నతాధికారులకు చేరింది. దీంతో అధికార యంత్రాంగం వెంటనే స్పందించి.. సదరు అధికారిని విడిపించే ప్రయత్నం చేసింది. అయితే రైతులు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో చివరకు రైతులకు వ్యవసాయానికి అవసరమైన అన్ని వస్తువులు ప్రభుత్వ ధరకు లభిస్తాయని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆ అధికారిని విడిచి పెట్టేందుకు అంగీకరించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
खाद की कालाबाज़ारी से तंग आकर मोतिहारी में कृषि सलाहकार को किसानों ने खंभे से बांध दिया @ndtvindia pic.twitter.com/UMfOKrug79
— manish (@manishndtv) August 29, 2022