సాధారణంగా మనం ప్యాసింజర్లకు గమనిక.. రెండో నెంబర్ ఫ్లాట్ ఫామ్ పై రావాల్సిన ట్రైన్ గంట ఆలస్యం వస్తుంది అన్న అనౌన్స మెంట్స్ వింటూనే ఉంటాం. దేశంలో రైళ్లు ఆలస్యంగా గురించి జోకులు పేలుతూనే ఉంటాయి. మద్యప్రదేశ్ లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఒక గూడ్స్ రైలు గమ్యస్థానం చేరుకోవడానికి ఒక ఏడాది పట్టింది. వివరాల్లోకి వెళితే..
గతేడాది మే నెలలో చత్తీస్‌గఢ్‌లోని ఓ రైల్వే స్టేషన్ నుంచి 1000 బియ్యం బస్తాల లోడ్ తో గూడ్స్ రైల్ బయలు దేరింది. కానీ అదే సమయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల సరైన సమయానికి బయలుదేరలేకపోయింది. ఇక ఆ గూడ్స్ గురించి అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు.వానకు నానుతూ పట్టాలపైనే ఉండిపోయింది. ఆ బోగితో గూడ్సు రైలు ఎట్టకేలకు ఏడాది ఆలస్యంగా మే 17న న్యూ గిరిధీ స్టేషన్‌ను చేరుకోవడంతో రైల్వే సిబ్బంది షాక్ తిన్నారు.
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో.. రైల్వే సిబ్బంది స్పందిస్తూ.. వెయ్య బస్తాల ఆహార ధాన్యాలతో దాదాపు మూడు వందల బస్తాలతో బయలు దేరిన గూడ్స్ కొన్ని ఇబ్బందుల వల్ల గమ్యానికి ఆలస్యంగా వచ్చిందిని అన్నారు. ఇందులో రెండు వందల వరకు బియ్యం బస్తాలు పాడయినట్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపిస్తామని స్టేషన్ మాస్టర్ పంకజ్ కుమార్ తెలిపారు.