ఈ మధ్యకాలంలో నిత్యవసర ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరల దెబ్బకు సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఇక ఇంధన ధరల గురించి చెప్పనక్కర్లేదు. వీటి ధరలు పది రూపాయలు పెరిగి… ఒక రూపాయి తగ్గుతుంది. వీటికి తోడు గ్యాస్ ధరలు కూడా ఈ మధ్యకాలం లో వరుసగా రెండు సార్లు పెరిగి.. మధ్యతరగతి వారికి గుదిబండగా మారింది. గ్యాస్ ధర పెరుగుదల కారణంగా సామాన్యుడు మరింత ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో ఓ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరి.. గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చిన ఆ రాష్ట్ర, ఆ ఉచిత సిలిండర్ కు సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఇటీవల కాలంలో గ్యాస్ ధరలు నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పెరిగాయి. గతంలో ఉన్న ధరలకే సామాన్యులు అల్లాడుతుంటే మళ్లీ పెంచి ఇంకాస్త ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. ఈక్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం పథకం ప్రకారం.. అంత్యోదయ కార్డు హోల్డర్లకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.55 కోట్లు కేటాయిచింది. కేబినేట్ సమావేశం తర్వాత చీప్ సెక్రటరీ సుఖ్ బీర్ సింగ్ సంధు ఈ పథకం గురించి మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 1,84,142 అంత్యోదయ కార్డుదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నట్లు ఆయన తెలిపారు.
ఉచిత ఎల్పీజీ సిలిండర్ తో పాటు రైతుల నుంచి గోధుమలు కొనుగోలు చేసేటప్పుడు రైతులకు క్వింటాల్ కు రూ.20 బోనస్ ను కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఆ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొండాలంటే.. లబ్దిదారుడు ఉత్తరాఖండ్ శ్వాశ్వత నివాసి అయి ఉండాలి. అంత్యోదయ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. అంత్యోదయ రేషన్ హోల్డర్ దానిని గ్యాస్ కనెక్షన్ లింక్ చేయాలి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని పొందాలనుకునే వారు… ఈ నెల(జూలై)లోనే మీ అంత్యోదయ కార్డ్‌ని LPG కనెక్షన్ కార్డ్‌తో లింక్ చేయండి.
మీరు ఈ రెండింటిని అనుసంధానించకుంటే..ఈ ప్రభుత్వ ఇచ్చే ఉచిత గ్యాస్ సిలిండర్ ను కోల్పోతారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని లాంఛనాలను పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా అంత్యోదయ రేషన్ కార్డుదారుల జాబితాను సిద్ధం చేసి స్థానిక గ్యాస్ ఏజెన్సీలకు పంపింది.త్వరలోనే వారందరికీ గ్యాస్ కనెక్షన్స్ ను అందించనుంది. మరి.. ఉత్తరాఖండ్ తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.