దూరాబారాలు ప్రయాణం చేయాలంటే కచ్చితంగా రైళ్లలో వెళ్లేందుకు ఇష్టపడతారు. పైగా రైళ్లలో అయితే ఎంతో కంఫర్ట్ గా కూడా ఉంటుంది. పైగా రైల్వేస్ దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ఇప్పుడు రైల్వే శాఖ తమ ప్రయాణికులకు ఒక శుభవార్తను తీసుకొచ్చింది.
దేశంలో ఉన్న అన్ని రవాణా సౌకర్యాల్లో రైల్వేస్ చాలా పెద్ద వ్యవస్థ. అలాగే చాలా ముఖ్యమైన రవాణా వ్యవస్థ కూడా. దగ్గర ఊర్లు, పక్క జిల్లాలకు మాత్రమే ప్రజలు బస్సుల్లో ప్రయాణం చేస్తారు. కానీ, పక్క రాష్ట్రాలు, దూరాలు వెళ్లాలి అంటే కచ్చితంగా రైళ్లలోనే ప్రయాణం చేస్తుంటారు. అయితే కొందరికి రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టంగా కూడా ఉంటుంది. ఇప్పుడు రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు ఒక శుభవార్తను తీసుకొచ్చింది. టికెట్ల విషయంలో కరోనా సమయంలో రైల్వే శాఖ కొన్ని నిబంధనలు మార్చింది. వాటిని ఇప్పుడు సడలించారు.
రైల్వే శాఖ తమ ప్రయాణికులకు అతి పెద్ద శుభవార్తను తీసుకొచ్చింది. కరోనా సమయంలో జనరల్ టికెట్లను కూడా మూడ్రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలంటూ చెప్పుకొచ్చారు. అప్పటికప్పుడు మీరు రైల్వే స్టేషన్ కి వెళ్లి టికెట్ తీసుకోవాలి అంటే టికెట్లు ఇవ్వడం మానేశారు. మీరు రిజర్వేషన్ చేసుకోవాల్సిందేనని చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ నిబంధనను సడలించారు. కరోనా సమయంలో రద్దీని నియంత్రించేందుకు ఆ విధానం తీసుకొచ్చారు. ఇప్పుడు దాదాపుగా సాధారణ పరిస్థితులు ఉన్నందుకు మునుపటిలాగానే జనరల్ టికెట్లను కౌంటర్ లో తీసుకోవచ్చునని స్పష్టం చేశారు.
ఇప్పుడు జనరల్ టికెట్లు పునరుద్ధరణ చేయడం వల్ల రైల్వే ప్రయాణికులకు ఇంకో శుబవార్త కూడా ఉంది. ముూడ్రోజుల ముందు రిజర్వేషన్ చేయాలి అంటే.. అదనంగా రూ.20 ఛార్జెస్ పడేవి. ఇప్పుడు ఆ అదనపు ఛార్జెస్ ఉండవు. సూపర్ ఫాస్ట్, మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లకు టికెట్ కౌంటర్లలోనే జనరల్ టికెట్లు జారీ చేయడం మళ్లీ ప్రారంభించారు. రైలుకు ముందు 2 బోగీలు, వెనుక రెండు బోగీలు ఉంటాయి. వాటిలోనే జనరల్ టికెట్లను కేటాయిస్తూ ఉంటారు. అయితే అవసరాన్ని బట్టి ఆ బోగీలను పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. పైగా వారిపై భారం కూడా తగ్గించినట్లు అవుతుంది.