భారత దేశంలో చాలా మంది రైలు ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టపడుతుంటారు.. ఎందుకంటే బస్సు ఇతర ప్రైవేట్ వాహనాల చార్జీల కన్నా రైలు చార్జీలు తక్కువగా ఉండటం.. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే రైలు లో పలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.. ఈ కారణం చేతనే రైలు ప్రయాణం అంటే మక్కువ చూపిస్తుంటారు. సాధారణంగా రైలు లో ప్రయాణీకులు ఆహార పదార్థ విషయంలో సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు.. మధుమేహం ఉన్నవారు.. చిన్న పిల్లలకు అందించే పోషకాహరం అందించే విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం భారత రైల్వే బోర్డు శుభవార్త తెలిపింది.
రైలు ప్రయాణీకుల ఆహారం విషయంలో పడుతున్న సమస్యలపై భారత రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణీకులకు ఇక నుంచి మధుమేహం ఉన్నవారు.. చిన్న పిల్లలు, పలు అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రత్యేక ఆహారాన్ని అందించేందుకు రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆహార పదార్థ విషయంలో ప్రయాణీకులు మెను మార్చుకునే సౌకర్యం భారత రైల్వే కేటరింగ్, టూరీజం కార్పోరేషన్ కి భారత రైల్వే బోర్డు వారు అనుమతి మంజూరు చేశారు. ఈ క్రమంలో చిరుదాన్యాలతో చేసే స్థానిక ఉత్పత్తులను మెనులో చేర్చుకోవచ్చని.. ప్రాంతీయ ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఐఆర్‌సీటీసీకి రైల్వే బోర్డు సూచిందింది.
కొంత కాలంగా రైలు ప్రయాణీకులు ఆహార విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు పండుగ సమయంలో సైతం ప్రత్యేక వంటకాలు విక్రయించుకునే సౌలభ్యాన్ని ఐఆర్‌సీటీసీకి రైల్వే బోర్డు తెలిపింది. చిన్న పిల్లలకు ఇష్టమైన ఆహారంతో పాటు అన్ని రకాల వయసు వారికి నచ్చే విధంగా ఆహారాన్ని తయారు చేయొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే నోటిఫై చేసిన ధరల ప్రకారం మాత్రమే ప్రీపెయిడ్ రైళ్లలో మెను విషయంలో నిర్ణయం ఐఆర్‌సీటీసీ నే తీసుకుటుందని నోట్ లో భారత రైల్వే బోర్డు వివరించింది. రైల్వే బోర్డు నిర్ణయంపై ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
In a major relief to diabetics, parents and health enthusiasts, Railway Board has allowed IRCTC to customise its menu to include local and regional cuisines as well as food suitable for diabetics, infants and health aficionados
https://t.co/MF3kqiGJkE https://t.co/I6d5oS3yWo— Economic Times (@EconomicTimes) November 15, 2022