నిత్యవసర ధరల పెరుగుదలతో సామాన్యుడు ఆర్థికంగా సమతమవుతున్నాడు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటివి పెరిగి.. మధ్యతరగతి కుటుంబాలు మరింతగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇటీవల ఇంధన ధరలు తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా సామాన్యులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూ స్ చెప్పింది. అందరూ నిత్యం ఉపయోగించే వంటనూనెల ధరల్లో ఉపశమనం కలిగించనుంది. సోయాబీన్ సన్ ప్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వం పరిశీస్తోందని బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారంతెలిసింది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్స్ ధరలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ఎడిబుల్ ఆయిల్స్ పై సుంకాన్ని తగ్గించడంతో పాటు హోర్డింగ్ ను నియంత్రించేందుకు నిబంధను కఠినతరం చేస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెపై సుంకం తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏటా 20 లక్షల మెట్రిక్ టన్నుల సన్ ప్లవర్ ఆయిల్, అదే స్థాయిలో సోయాబీన్ ఆయిల్ భారత్ దిగుమతి చేసుకుంటుంది. కేంద్రం ప్రకటనతో వంటనూనె ధర లీటర్ కు రూ.3 తగ్గనుంది. అయితే ఈవంట నూనెల ధరలపై ఈవారంలో తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది.
ఇదీ చదవండి: సామ్యానుడి నెత్తిన మరో పిడుగు..పెరగనున్న వాటి ధరలు!ఇండోనేషియా తాజాగా పామాయిల్ పై ఎగుమతి నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇండోనేషియా నిర్ణయం తర్వాత ధరలపై మరింత ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నపప్పటికీ, అదే సమయంలో పామాయిల్ ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ఇతర వంటనూనెలపై ఒత్తిడి కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు.
ప్రస్తుతం 5% ఉన్న వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్ ను తగ్గించాలా లేదా తొలగించాలా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరి..వంటనూనెల ధరలు తగ్గనున్నట్లు వస్తున్న సమాచాచరం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.