భారతదేశంలోని వాహనదారులకు త్వరలోనే ఓ శుభవార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి వాహనాదారుడు ఎదురుచూస్తున్న విధంగా త్వరలో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యాపై నాటో దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్యా మిత్ర దేశమైన ఇండియాకు ప్రపంచ మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు ఆఫర్ చేసింది. రష్యా ఆఫర్ కు ఇండియా వెంటనే స్పందించి 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆర్డర్ కూడా చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: మూడు రోజులు జాగ్రత్త.. వాతావరణ శాఖ హెచ్చరిక!
ఒక ట్రేడర్ ద్వారా ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. మే నలకు సంబంధించి ఉరల్స్ క్రూడ్ ను.. బ్రెంట్ క్రూడ్ ధర కంటే 25 డాలర్లు తక్కువకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ ఆయిల్ ను రష్యా భారత తీరం వరకు రవాణా చేయాల్సి ఉంటుంది. రవాణా పరంగా సమస్యల బాధ్యత కూడా విక్రయదారే చూసుకోవాల్సి ఉంటుంది. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించినా, ఆయిల్, ఇంధనాలను మాత్రం మినహాయించారు. కావున భారత్- రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసినా కూడా ఆంక్షలు పరిధిలోకి రాదు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో భారత్ పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.