మద్యం లేనిదే మందు బాబులకు నిద్ర పట్టదు. పొద్దు ఎక్కదు.. తెల్లారదు. తెల్లార్లు షాప్ తెరవాలే కానీ.. బార్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. భీభత్సంగా తాగే్స్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మద్యం ప్రియులకు శుభవార్త లాంటి కబురు వచ్చింది.
మద్యం లేనిదే మందు బాబులకు నిద్ర పట్టదు. పొద్దు ఎక్కదు.. తెల్లారదు. తెల్లార్లు షాప్ తెరవాలే కానీ.. బార్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. భార్యను, బిడ్డలను కూడా మర్చిపోయి మత్తులో మునుగుతూ అందులోనే జోగుతుంటారు. వద్దని వారించినా వినిపించుకోరూ సరి కదా.. ఇంకా తాగేందుకు డబ్బుల కోసం ఇంట్లో వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇది చాలదన్నట్లు ఒక్క రోజు మందుకు డబ్బులు లేకపోయినా, మందు దొరక్కపోయినా.. అల్లాల్లాడిపోతుంటారు. చివరకు ఇంట్లో సామాన్లు కూడా తాకట్టు పెట్టేస్తుంటారు. భీభత్సంగా తాగే్స్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మద్యం ప్రియులకు శుభవార్త లాంటి కబురు వచ్చింది. అదేటంటే..మందు గ్లాసు కోసం గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం లేదు. మీరు విన్నదీ నిజమేననండీ, కావాలంటే మీ మందు మీద ఒట్టు.
అయితే 24 గంటలు మందు దుకాణాలు తెరచి ఉంచుతారేమో అనుకుంటున్నారేమో కానేకాదూ.. ఏటీఎం రూపంలో తీసుకురాబోతున్నారు. ఒకప్పుడు నగదు తీసుకోవడానికి ఉపయోగించే ఏటీఎంలు ఆ తర్వాత బంగారం, బియ్యం రైస్‌లు వంటివి అందించేవి. తాజాగా బార్ ఏటీఎంలు తెస్తున్నారు. బీరు, బ్రాంది, విస్కీ, రమ్ , జిన్ … ఇలా ఏ బ్రాండైనా కూడా ఏటీఎంలో తీసుకోవచ్చట. అయితే ఈ ఏటీఎంలు ఉండేవీ తెలుగు రాష్ట్రాల్లో కాదు. తమిళనాడులోని చెన్సైలో. తమిళనాడు వీటిని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం కోయంబేడుతో పాటు మరో మూడు చోట్ల ఈ మెషిన్లు అందుబాటులోకి వచ్చాయి. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈ మెషిన్ల నుంచి మందు కొనుగోలు చేయొచ్చు. ఇక మద్యం బాబులకు పసందే. బారులతో, మద్యం దుకాణాలతో పని లేకుండా.. రాత్రి, పగలు అని లేకుండా మద్యం ప్రియులు ఈ ఏటీఎంలకు వెళ్లి కొనుక్కోవచ్చు. మద్యం కోసం నో వెయిటింగ్ అన్నమాట.
కోక్, పెప్సీల సీసాలను ఓ పెద్ద ఫ్రిడ్జ్ నుంచి ఎలా కొనుగోలు చేస్తామో.. అలాంటి వెండింగ్ మిషన్ల ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం ఈ మెషిన్లను కోయంబేడు సమీపంలోని వీఆర్‌మాల్, టెన్ స్క్వేర్ మాల్, రాయపేట ఎక్స్‌ప్రెస్ అవెన్యూ, వేళచ్చేరి ఫినిక్స్‌మాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇంతకు ఈ మిషన్ల నుండి వాటిని ఎలా కొనుగోలు చేయాలంటే.. వినియోగదారుడు ఆటోమేటిక్ లిక్కర్ వెండింగ్ మెషీన్‌ను తాకిన క్షణంలో ఒక మెను కనిపిస్తుంది. ఆ మెనులో తనకు నచ్చిన మద్యాన్ని ఎంచుకోవచ్చు. అనంతరం డబ్బు చెల్లించే ఆప్షన్ వస్తోంది. డబ్బులను ఆన్‌లైన్‌లో లేదా నగదు రూపంలో చెల్లించాల్సి ఉంది. డబ్బులు చెల్లించిన తరువాత వినియోగదారుడు ఎంచుకున్న బాటిల్ బయటకు వస్తుంది. అయితే.. దీన్ని ట్రయల్ ప్రాజెక్ట్‌గా లాంచ్ చేసినట్టు తెలుస్తోంది. ఆచరణ యోగ్యంగా ఉంటే.. మిగతా చోట్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వెండింగ్ మెషీన్లలో ఉదయం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం పొందవచ్చని, 21 ఏళ్లలోపున్న వారిని దుకాణ సిబ్బంది అనుమతించరని అధికారులు తెలిపారు.