భారత ప్రభుత్వం అన్నదాతలకు వ్యవసాయంతో పాటుగా పశుపోషణను ప్రోత్సహించేందుకు ‘పశు క్రెడిట్ కార్డ్’ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీనితో రైతుల ఆదాయ వనురును పెంచుకునే అవకాశం ఉంది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు రూ.1.60 లక్షల రుణాన్ని సాయంగా ప్రభుత్వం అందజేస్తుంది.
భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఎంత అభివృద్ధి చెందినా.. టెక్నాలజీ పరంగా ఎంత సాధించినా దేశానికి అన్నం పెట్టే రైతున్నలు మాత్రం వ్యవసాయం చేయాల్సిందే. పంటను పండించి దేశానికి అందించాల్సిందే. అందుకే రైతులు దేశానికి వెన్నెముక అంటారు. అలాంటి అన్నదాతలకు సాయంగా భారత ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చింది. తాజాగా రైతులకు వ్యవసాయ పరంగా పశుపోషణకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ‘పశు క్రెడిట్ కార్డ్’ స్కీమ్ తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు రూ.1.60 లక్షల రుణాన్ని సాయంగా అందిస్తుంది. ‘పశు క్రెడిట్ కార్డ్’ పథకం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండేందుకు భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వ్యవసాయం చేసే రైతులు సకాలంలో వానలు రాక, కొన్నిసార్లు అధిక వానలు, వరదలతో కూడా పండిన పంటలను నష్టపోతారు. ఈ మధ్యకాలంలో రైతులు పంట చేతికందే సమయానికి అకాల వర్షాలతో చాలా నష్టపోతున్నారు. ఒక్కోసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు సాయం అందజేస్తుంది. అయితే కేవలం వ్యవసాయం పైనే కాకుండా అన్నదాతలకు ఆదాయం పెంచే దిశగా భారత ప్రభుత్వం పశుపోషణ కొరకు పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే తాజాగా రైతుల కోసం ‘పశు క్రెడిట్ కార్డ్’ పథకాన్ని ప్రారంభించింది. పశు క్రెడిట్ కార్డు పథకం కింద ఆవులు, గేదెలు కొనుగోలు చేయడానికి.. పశువులను నిర్వహణ కోసం సర్కార్ రైతులకు రూ.1.60 లక్షల రుణాన్ని సాయంగా అందజేస్తుంది. దీని ద్వారా రైతులు ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం కలుగుతుంది.
‘పశు క్రెడిట్ కార్డ్’ పొందడానికి ముందుగా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు ఫారంను పొందాలి. దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి కేవైసీ పత్రాలతో కలిపి బ్యాంకులో సమర్పించాలి. బ్యాంకు అధికారులు పూరించిన ఫారంతోపాటు ఏమి అటాచ్ చేయాలో వివారాలు బ్యాంకు అధికారులు తెలియజేస్తారు. రైతుల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ‘పశు క్రెడిట్ కార్డ్’ ఇష్యూ చేస్తారు. రుణం పొందుటకు రైతులు ఎలాంటి హామీ పత్రాలు బ్యాంకు వారికి పెట్టాల్సిన పని లేదు. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణం 7 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రైతులు సరైన సమయానికి రుణం చెల్లించినచో 3 శాతం రాయితీ కూడ లభిస్తుంది. సరైన సమయంలో చెల్లించిన వారికి కేవలం 4 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి వస్తుంది. పశు క్రెడిట్ కార్డ్ పై రుణం తీసుకున్న రైతులు 5 ఏండ్లలోపు చెల్లించాల్సి ఉంటుంది. మీరు కూడా
‘పశు క్రెడిట్ కార్డ్’ పొందాలంటే మీకు సమీప బ్యాంకు వద్ద పూర్తి వివరాలను పొందవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత నెల రోజుల లోపు ‘పశు క్రెడిట్ కార్డ్’ అందుతుంది.