కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో ఉద్యోగులది కీలక పాత్ర ఉంటుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధులా ఉంటారు. అందుకే ప్రభుత్వాలు సైతం వారికి అనేక రకాల రాయితీలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తుంటాయి. అలానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు తరచూ గుడ్ న్యూస్ చెప్తుంటాయి. తాజాగా ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో ఉద్యోగులది కీలక పాత్ర ఉంటుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధులా ఉంటారు. అందుకే ప్రభుత్వాలు సైతం వారికి అనేక రకాల రాయితీలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తుంటాయి. అలానే పలు సందర్భాల్లో బోనాస్, డీఏలు, ఇతర అలవెన్సులు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు శుభవార్త చెబుతాయి. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.పెన్సన్స్ అలవెన్స్ లో 4శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు , పింఛనుదారులకు గ్రాట్యుటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది.
శుక్రవారం ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రిమండలి పలు అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛను దారులకు ఈ ఏడాది జనవరి 1 నుంచి 4శాతం డీఏ, డీఆర్ పెంచుతూ ఈ సమావేశంలో మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉన్న 38శాతం డీఏ కాస్తా 42 శాతానికి పెరుగుతుంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు 4శాతం డీఏ పెంచడం వలన ప్రభుత్వంపై ఏటా రూ. 12,815.60 కోట్ల అధికభారం పడనుంది. అలానే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన 47.58 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలుగుతుంది.
ఏడవ వేతన సంఘం ఇచ్చిన సిఫార్సులకు అనుగుణంగా ఈ డీఏ పెంపునుకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. చివరిసారిగా 2022 సెప్టెంబర్ 28న కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుదలను ప్రకటించింది. ఆ పెంచిన డీఏ 2022 జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక ఇదే సమావేశంలో ముడి జనపనారకు కనీస మద్దతు ధరను క్వింటా రూ.4,750 నుంచి రూ.5,050కు పెంచుతు కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా రైతులకు పెట్టుబడిపై 63శాతం లబ్ధి చేకూరి, 40 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.