మనం సాధారణంగా డబ్బులను డ్రా చేసుకునే ఏటీఎంలను చూసి ఉంటాము. 24 గంటల్లో ఎప్పుడైనా ఆ ఏటీఎం సెంటర్ ల వద్దకు వెళ్లి డబ్బులను డ్రా చేసుకోవచ్చు. అలానే ఇటీవలే బంగారం డ్రా చేసుకుని ఏటీఎం సెంటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా బిర్యానీ ఏటీఎంలు కూడా ప్రారంభమయ్యాయి.
మనం సాధారణంగా డబ్బులను డ్రా చేసుకునే ఏటీఎంలను చూసి ఉంటాము. 24 గంటల్లో ఎప్పుడైన ఆ ఏటీఎం సెంటర్ ల వద్దకు వెళ్లి డబ్బులను డ్రా చేసుకోవచ్చు. అలానే ఇటీవలే బంగారం డ్రా చేసుకుని ఏటీఎం సెంటర్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే తాజాగా ఫుడ్ ఏటీఎం సెంటర్ కూడా ప్రారంభమైంది. వినడానికి విచిత్రంగా ఉన్న ఎనీ టైమ్ బిర్యానీ అందించేలా ఏటీఎంలు ప్రారంభమయ్యాయి. ఈ బిర్యానీ ఏటీఎం కేంద్రాలో మనుషులు ఉండరు. ఏటీఎం మిషన్ తరహాలో ఓ మిషిన్ ఉంటుంది. అదే మన ఆర్డర్ ప్రకారం ఫుడ్ ను డెలివరీ చేస్తుంది. అంతేకాక మన దేశంలో తొలిసారి ఈ తరహాలో ఏటీఎం సెంటర్ ప్రారభమైంది. మరి.. ఈ వింతైనా ఏటీఎం ఎక్కడ ఉంది.. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం…
మన దేశంలో తొలిసారిగా బిర్యానీ ఏటీఎం ప్రారంభం కానుంది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఈ ఏటీఎం ప్రారంభమైంది. చెన్నై నగరంలోని కొలాతుర్ ప్రాంతంలో బిర్యానీ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. బాయ్ వీటు కల్యాణం(BVK)అనే సంస్థ ఈ ఏటీఎం ను లాంచ్ చేసింది. ఔట్ లెట్ లో 32 అంగుళాల స్క్రీన్లు ఉంటాయి. వాటి మీద మెనూ బ్రౌజ్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు. మీకు కావాల్సిన ఆర్డర్ ను ఆ మిషన్ స్క్రీన్ మీద ప్రెస్ చేసి డబ్బులు చెల్లిస్తే చాలు. ఎంత సమయంలో మీకు పుడ్ డెలివరీ అవుతుందో స్క్రీన్ పై కనిపిస్తుంది. అలా కొన్ని నిమిషాల తరువాత పక్కనే ఉన్న కియోస్క్ లో బిర్యానీ ప్యాకెట్లు వస్తాయి.
బిర్యానీ ఆర్డర్ కోసం కార్డుల ద్వారా లేదా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి గానీ పేమెంట్లు చేయొచ్చు. డబ్బుల చెల్లింపులు పూర్తయిన కొద్ది నిమిషాల్లో ఫ్రెష్ అండ్ ప్యాక్ట్ ఫుడ్ డెలివరీ అవుతుంది. బిర్యానీ ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాట్లు చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. డబ్బుల ఏటీఎం ల తరహాలోనే ఈ బిర్యాని ఏటీఎంలు వినియోగదారులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. సాధారణంగా మంచి ఫేమస్ హోటళ్ల వద్ద జనాలు క్యూ కట్టి మరీ బిర్యానీ కొనడం మనం చూస్తుంటాము. అంతకు మించి ఈ బిర్యానీ ఏటీఎం మెషిన్ల వద్ద కూడా జనం క్యూలు కట్టి మరి బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్ చేస్తున్నారు.
ఈ ఏటీఎం లో చికెన్, మటన్, ఎగ్ బిర్యానీ, స్టార్టర్స్(చికెన్-65, ఫ్రైడ్ చికెన్, కోలా ఉరుండై), డెజర్ట్ లు(ద్రాక్ష రసం, ఎలనీర్ పాయసం), అలానే వెజ్ బిర్యానీ కూడా ఇందులో లభిస్తుంది. టచ్ స్క్రీన్ డిస్ ప్లేపై బిర్యానీ విభాగంలోని మినీ, రెగ్యులర్, బకెట్ వంటి ఆప్షన్స్ సైతం ఉన్నాయి. టెక్నాలజిపై ఆసక్తి ఉన్నవారు, ఎంతో మంది తమ బిర్యానీ కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపించారని, రుచి, నాణ్యత విషయంలో రాజీపడకపోవడం వల్లే ప్రస్తుతం ఈ విజయం సాధ్యమైందని బీవీకే సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.