మహారాష్ట్రలో ఉస్మానాబాద్ జిల్లా వాసి ప్రాంతంలో అద్భుతం జరిగింది. రైతు ప్రభునిముద్దిమాని రోజులాగే తన పొలం పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక అప్పుడే వింత శబ్దంతో ఆకాశం నుంచి ఓ బంగారు రంగులో ఉన్న రాయి జారి పడింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన రైతు దగ్గరికెళ్లి చూసేసరికి బంగారు వర్ణంలో రాయిని చూసి ఆశ్యర్యపోయాడు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు పరుగుల మధ్య ఈ వింత రాయిని చూసేందుకు ఎగబడ్డారు.
ఇక విషయం తెలుసుకున్న తహశీల్దార్ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టి ఆ రాయి 2.38 కేజీల బరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. . ఇక ఈ విచారణలో ఎలాంటి విషయాలు తెలియకపోవటంతో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆ అధికారులు ఆ రాయిని తీసుకెళ్లి పరిశోధనలు చేస్తున్నారు. ఇక కొంతమంది అధికారులు మాత్రం ఆ రాయిని బంగారు శిలగ అభివర్ణిస్తున్నారు. ఈ రాయి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో నెటిజన్స్ రైతు పంట పండిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆకాశం నుంచి జారిపడ్డ ఈ వింత రాయిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.