వేసవి కాలం వచ్చిందంటే చాలు చిన్నా పెద్ద ఐక్ క్రీమ్ పార్లర్ కి వెళ్లి మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి తింటాం. చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడే కుల్ఫీ ఎన్నో రకాల ఫ్లేవర్స్ లో అభిస్తాయి.
వేసవి కాలం వచ్చిందంటే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. చాలా మంది వేసవి కాలంలో సేద తీరేందుకు శీతలపానియాల వైపు మొగ్గు చూపిస్తుంటారు. ఇక చిన్నా పేద్దా అనే తేడా లేకుండా రక రకాల ఐస్ క్రిమ్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. వేసవి కాలంలో ఎక్కువగా రోడ్లపై ఐస్ క్రీమ్స్ అమ్ముతుంటారు. కొన్ని ఐస్ క్రీమ్ పార్లర్స్ లో ఎన్నో వెరైటీలు ఐస్ క్రీమ్స్ ని లభిస్తుంటాయి. ఐస్ క్రీమ్స్ లో కుల్ఫీ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టపడుతుంటారు. కుల్ఫీలో మిల్క్, మ్యాంగో, బాదాం పిస్తా ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైన గోల్డ్ కుల్ఫీ గురించి విన్నారా? తిన్నారా? అదేంటీ గోల్డ్ కుల్ఫీ అని షాక్ అవ్వకండి.. ఇది మనదేశంలోనే లభిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఐస్ క్రీమ్స్ లో కుల్ఫీ అంటే ప్రతి ఒక్కరూ ఎంతగానో ఇష్టపడుతుంటారు. కుల్ఫీ బాదాం, మ్యాంగో, చాక్లెట్, మిల్క్ ఇలా ఎన్నో రకాల ఫ్లేవర్స్ లో లభిస్తుంటాయి. మధ్యప్రదేశ్.. ఇండోర్ లో ఓ వ్యాపారి ఎంచక్కా గోల్డ్ కుల్ఫీ అమ్ముతున్నాడు. సాధారణంగా గోల్డ్ కోటింగ్ ఉన్న కుల్ఫీని చూడటమే కానీ తినడానికి వీలు ఉండదని అందరూ అనుకుంటారు. కానీ ఇది చూడటానికి కాదు.. నిజంగా లొట్టలేసుకుంటూ తినేయొచ్చు. అసలే.. దేశంలో బంగారం విపరీమతైన రేటు పలుకుతుంది.. మరి గోల్డ్ కుల్ఫీ అంటే ఏ రేంజ్ లో ధర ఉంటుందో అని అందరూ భావిస్తుంటారు. కానీ దీని ధర రూ.351. ఈ వ్యాపారి పేరు ప్రకాశ్.
ప్రకాశ్ అనే వ్యాపారి గత కొంత కాలంగా ఇండోర్ లో ఫేమస్ బజార్ లో ఈ గోల్డ్ కుల్ఫీని అమ్ముతున్నాడు. ఫ్రిడ్జ్ లో ఉంచిన కుల్ఫీని తీసి బంగారపు పూత ఉన్న పల్చటి ఆకులో చుట్టి అమ్ముతుంటాడు. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ గోల్డ్ కుల్ఫీలు అమ్మే ప్రకాశ్ తన ఒంటినిండా బంగారు వస్తువులు ధరించి ఉండటం విశేషం. వేసవి కాలంలో గోల్డ్ కుల్ఫీలకు మంచి గిరాకీ ఉంటుందని ప్రకాశ్ అంటున్నాడు. ఈ తరహా గోల్డ్ కుల్ఫీలను అమ్ముతున్న వీడియో ని ఫుడ్ బ్లాగర్ కలాష్ సోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై రక రకాల కామెంట్స్ వినిపిస్తుంది.. అది అసలు గోల్డ్ కాదని.. అంతా ఉత్తిదే అని.. అంతా ఫేక్ అంటూ కొంతమంది.. మనీ వేస్ట్ బ్రరద్ అంటూ మరికొంతమంది అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోని 40 వేల మంది నెటిజన్లు వీక్షించారు.