పిల్లి పిల్లికొట్టుకుని రొట్టె కోతిపాలు చేశాయని పూర్వం పెద్దలు ఓ సామెత చెప్పేవారు. అలానే కొందరు చేతిలోకి వచ్చిన లక్ష్మిదేవిని చిన్న గొడవలతో పోలీలుసు పాలు చేస్తుంటారు.తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ వ్యక్తి ఇంట్లో లక్ష్మిదేవి తిష్ట వేసింది. కానీ ఆ విషయం అతడికి తెలియదు. ఈ క్రమంలో ఇంట్లో బాత్రూమ్ నిర్మాణం కోసం గుంత తవ్వుతుండగా బంగారు నాణేలు బయటపడ్డాయి. ఈ అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ లోని కొత్వాలి ప్రాంతంలో ని కజియానా మొహల్లా అనే గ్రామంలో నూర్ జహాన్ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె ఇంట్లో టాయిలెట్‌ను నిర్మించుకోవాలనుకుంది.ఆ పని కోసం కొందరు కూలీలతో మాట్లాడుకుంది. వారు వచ్చి పనులు మొదలుపెట్టారు. ఈక్రమంలో గుంత తవ్వుతుండగా కూలీలకు ఓ రాగిపాత్ర కనిపించింది. దానిని ఓపెన్ చేసి చూడగా.. దాని నిండా బంగారు నాణేలు కనిపించాయి. అవన్నీ బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణేలు. దీంతో కూలీలు పరస్పరం గొడవకు దిగి పని మధ్యలో ఆపేశారు. మరుసటి రోజు ఉదయం తమంతట తామే వచ్చి నిధి దొరుకుతుందనే ఉద్దేశ్యంతో తవ్వడం మొదలుపెట్టారు.
యాజమానికి, కూలీలకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో వీరి పంచాయితీ పోలీస్ స్టేషన్ కి చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు అక్కడి వచ్చి కూలీలను, ఇంటి యాజమానిని విచారించారు. ఈ క్రమంలో వారి నుంచి 10 బంగారం నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారు నాణేలన్నీ(1889-1920) కాలానికి చెందినవి గా గుర్తించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: justice for srimathi: తమిళనాడు విద్యార్థిని ఆత్మహత్య కేసులో ట్విస్ట్ ! మరోసారి పోస్ట్ మార్టం!
ఇదీ చదవండి: Maharashtra Islampur: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఎద్దుల బండిని కనిపెట్టింది వీళ్ళే!