పుట్టిన వారు మరణించక తప్పదని తెలిసి కూడా చాలామందికి డబ్బుపై ఆశ చావదు. ఎంత ఆస్తి ఉన్నా ఇంకా సంపాదించాలి తపన పడుతుంటారు. ఈ క్రమంలో దైవ చింతన కంటే డబ్బు చింతన ఎక్కువగా ఉంటుంది. చనిపోయిన తరువాత తమతో ఏమి తీసుకెళ్లమని తెలిసికూడా ఆ సంపాదన యంత్రంలో పడిపోతారు. కానీ కొందరు ఆ సత్యానికి తెలుసుకుని ఆచరణలో పెడుతున్నారు. ఆస్తులు మీద వ్యామోహం వదలి ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఓ కుటుంబం కూడా తమ కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ లోని బాలాఘట్ కు చెందిన రాకేశ్ సురానా, లీనా సురానా(36) దంపతులు. వారికి అమయ్ సురానా(11) అనే కుమారుడు ఉన్నాడు. రాకేశ్ సురానా ఆభరణాల వ్యాపారం చేస్తుంటాడు. వారి కుటుంబానికి దైవ భక్తి ఎక్కువ. ప్రతి రోజూ దైవ పూజాలు చేస్తూ.. జీవిత సత్యాలకు సంబంధించిన పుస్తకాలు, కథలు చదువుతుండే వారు. ఈ క్రమంలో జీవిత అంటే ఏమిటి? ఇంత సంపాదించిన మిగిలేది ఏమిటి? అసలు జీవిత పరమార్ధం ఏమిటి? అనే సందేహాలు కలిగి.. జీవిత సత్యాలు తెలుసుకున్నారు. దీంతో తన రూ.11 కోట్ల విలువైన ఆస్తిని గోశాల, ఆధ్యాత్నిక సంస్థలకు విరాళంగా రాసిచ్చారు.కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాకేశ్ సురానా తెలిపారు. తన భార్య, కుమారుడితో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని వెల్లడించారు. రాకేశ్ సురానా కుటుంబం మే22న జైపుర్ లో దీక్ష స్వీకరించనున్నారు. గురు మహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాకేశ్ తెలిపారు. ఈ గోప్ప నిర్ణాయన్ని స్థానికులు ప్రశంసించారు. అంతే కాకా ఆ కుటుంబాన్ని స్థానికులు రథంపై ఊరేగించి.. సన్మానించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి:స్టేషన్ లో వెక్కి వెక్కి ఏడ్చిన కానిస్టేబుల్.. ఎందుకంటే!