ఇటీవల వరుసగా విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పలు విమానాలు, హెలికాప్టర్లు టెక్నికల్ ఇబ్బందులు, ప్రకృతి వైపరిత్యాలకు గురై ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు పైలెట్లు ముందుగానే జరగబోయే ప్రమాదాలను గుర్తించి సెఫ్టీగా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అయితే ఇప్పుడు నేలపైనే కాదు.. ఆకాశంలో కూడా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన విమానాలు, హెలికాప్టర్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు రన్ వే పై ఉన్న విమానాలు సైతం ప్రమాదాలకు గురిఅవుతున్నాయి. తాజాగా ఓ విమానం అదుపు తప్పి ఏకంగా ఇంట్లోకే దూసుకు వెళ్లింది. ఈ ఘటన ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఝార్ఖండ్‌లో ఓ విమానం తీవ్ర ప్రమాదానికి గురైంది. ధన్ బాద్ నగరంలో ఓ గ్లైడర్ విమానం అదుపు తప్పి ఇంట్లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో పైలట్ తో సహా ఓ బాలుడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ధన్ బాద్ లోని బర్వాడ్డ ఏర్ స్ట్రీప్ నుంచి గ్లైడర్ విమానం బయలుదేరిన కొద్ది సేపటికే ఎయిర్ పోర్ట్ కు 500 మీటర్ల దూరం బిర్సా ముండా పార్క్ సమీపంలోని నీలేష్ కుమార్ ఇంటి వద్ద అదుపుతప్పి పిల్లర్ ని ఢీ కొట్టింది. దాంతో విమానం ముక్కలయ్యింది. ఈ ఘటనలో గ్లైడర్‌లో ఉన్న పైలట్, చిన్నారికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని నీలేశ్ కుమార్ మాట్లాడుతూ.. విమాన ప్రమాద సమయంలో తమ పిల్లలు బయట ఉన్నారని దాంతో ప్రమాదం నుంచి బయట పడ్డారని అన్నాడు.
బర్వాడ్డ ఏర్ స్ట్రీప్ నుంచి గ్లైడర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక ఇబ్బంది కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే విమానం కూలిపోవడానికి గల కారణం పూర్తి స్థాయిలో విచారణ అనంతరం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ధన్ బాగ్ సిటీ అందాలను ఆకాశం నుంచి చూడటానికి చిన్నపాటి విమానాలను ఓ ప్రైవేట్ ఏజెన్సీ నడుపుతుందని తెలిపారు. వీటిలో పైలట్ మరో వ్యక్తి మాత్రమే ప్రయాణించగలరు. గాయపడ్డ బాలుడు ధన్ బాగ్ లో తన బంధువుల ఇంటికి వచ్చాడని సమాచారం. ప్రస్తుతం ఆ బాలుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
#Watch : उड़ान भरते ही घर पर गिरा 2 सीटर ग्लाइडर। पायलट सहित 2 लोग गंभीर रूप से हुए घायल, हादसे का वीडियो आया सामने, घटना धनबाद की है।#Dhanbad #GliderCrash pic.twitter.com/ycMXXCy86i
— Hindustan (@Live_Hindustan) March 24, 2023