సోషల్ మీడియాలో ఆ వీడియోను మేఘన షేర్ చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.
నేటి ప్రపంచంలో సోషల్ మీడియా ఓ నిత్య అవసరం అయిపోయింది. తమ బాధల్ని, సంతోషాల్ని పంచుకోవటానికి.. ఇతరులతో స్నేహం చేయటానికి నూటికి 80 శాతం మంది సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. అయితే, అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు.. అతి ఎప్పుడూ పనికి రాదు. హద్దులు దాటి ప్రవర్తించినపుడు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అయినా, కొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవటానికి కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. తాజాగా, ఓ యువతి తనకు పరిచయం లేని వ్యక్తులకు ఫోన్ నెంబర్లు ఇచ్చింది.
అది కూడా తను బస్సులో వెళ్తుండగా.. కారులో ఉన్న వ్యక్తులకు ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆమె చేసిన పనిని నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన మేఘన అనే యువతి కొద్దిరోజుల క్రితం బస్సులో బెంగళూరు నుంచి కొచ్చిన్ ప్రయాణిస్తూ ఉంది. ఆమె విండో సీట్ దగ్గర కూర్చుని ఉంది. ఆమెతో పాటు ఆమె స్నేహితురాలు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ కారు వారి బస్సు పక్కనే వెళుతూ ఉంది. కొద్ది సేపు ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, మేఘన తన ఫోన్ నెంబర్‌ను వారికి ఇచ్చింది. తర్వాత ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
‘‘ నిన్న బెంగళూరు నుంచి కొచ్చిన్ వస్తున్నపుడు కొంతమంది అద్భుతమైన వ్యక్తుల్ని కలిశాను. వారితో మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. ప్రతీ రోజును ఓ జ్ఞాపకంగా మార్చుకోవటానికి ప్రయత్నించండి. మీరు లేకుంటే నా జీవితం బోరింగ్‌గా ఉంటుంది. ఫన్ లేకుంటే నేను బతకలేను’’ అని అంది. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు యువతిపై ఫైర్ అవుతున్నారు. ‘‘ ఛీఛీ నువ్వు ఆడపిల్లవా!’’.. ‘‘ నువ్వసలు అమ్మాయివేనా.. అలా చేస్తే ఇబ్బందుల్లో పడతావు’’ అంటూ హెచ్చరిస్తున్నారు. మరి, మేఘన చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.