ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 17 ఏళ్ల యువతిపై 28 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ దారుణానికి పాల్పపడింది ఆమె తండ్రి మాత్రమే కాదు.. అతని సహచరులు. ఈ దారుణ ఘటన యూపీలోని లలిత్‌పూర్‌లో జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలి తండ్రి ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
బాలిక ఆరో తరగతిలో ఉన్నప్పుడే ఆమెకు అశ్లీల చిత్రాలు చూపించి లైంగిక ప్రేరేపణలు కలిగేలా చేసి లొంగదీసుకునే ప్రయత్నం చేసేవాడు. ఓ రోజు కొత్త బట్టలు కొని, బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తల్లిని చంపేస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి బాలికపై పలుమార్లు అత్యాచారం చేస్తూ వచ్చాడు. బాధితురాలు చాలా రోజుల నుండి జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పకుండా తనలో తానే కుమిలిపోయింది. ఒకరోజు తనకు మత్తు మందు పెట్టారని.. మత్తులో ఉన్న ఒక వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, తీవ్రమైన కడుపునొప్పితో ప్రాణాలతో బయటపడ్డానని తెలిపింది. అయితే ఇదంతా హోటల్‌లోని పలు గదుల్లో జరిగిందని, ప్రతిసారీ ఒక కొత్త వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది.
బాలిక ఫిర్యాదు ఆధారంగా బాధితురాలి తండ్రి, సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ జైన్ జోజియా, బహుజన సమాజ్ వాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దీపక్ అహిర్వార్ సహా 28 మందిపై సెక్షన్ 376 డి, అత్యాచారం, 354, 323, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు బాలిక ఫిర్యాదుతో స్పందించిన తిలక్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనను, తన సోదరుడిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.