గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యారు. సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎంపిక కోసం నేడు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషీ, నరేంద్ర తోమర్ లు ఇవాళ గాంధీనగర్ లో నిర్వహించిన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.
అయితే ఘట్లొడియా నుండి భూపేంద్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సమావేశానికి విజయ్ రూపానీ, కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా హాజరయ్యారు. కాగా, గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో విజయ్ రూపానీకి బదులుగా మరో నేతను ఎంపిక చేయాలని ఆ పార్టీ భావించింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం విజయ్ రూపానీని సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరింది. అధిష్టానం కోరిక మేరకు సీఎం పదవి నుంచి విజయ్ రూపానీ తప్పుకున్నారు.
ఈ నేపథ్యంలోనే భూపేంద్ర పటేల్ పేరును కొత్త సీఎంగా విజయ్ రూపానీ ప్రతిపాదించారు. భూపేంద్ర పటేల్ గతంలో అహ్మదాబాద్ మున్సిపల్ స కార్పోరేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మెన్ గా పనిచేశారు. ఇదిలా ఉంటే.. జరాత్ అసెంబ్లీ ఎన్నికలు మరో 15 నెలలు జరగనుండగా సీఎంగా విజయ్ రూపానీతో రాజీనామా చేయించడం వెనుక బీజేపీ వ్యూహమేంటనే అంశంపై చర్చ జోరందుకున్నాయి.