హల్దీ ఫంక్షన్, చుట్టూ పూలతో అందమైన డెకరేషన్, రెండు వందలకు పైగా అతిథులు, మేళ తాళాలు, అంబరాన్ని అంటే సంబరాలు.. ఇవ్వనీ చూసి ఏదో సెలబ్రిటీ వెడ్డింగ్ అనుకున్నారు అంతా. తీరా చూస్తే పీటల మీద ఇద్దరు మగాళ్లు కూర్చుని ఉన్నారు. అవును అది గే మ్యారేజ్.. ఇద్దరు మగాళ్లు అట్టహాసంగా పెళ్లి చేసుకున్నారు. అభిషేక్ రే, చైతన్య ఇద్దరూ జులై 3న కోల్ కతాలో పెద్దల సమక్షంలో.. శాస్త్రోక్తంగా మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.
అభిషేక్ రే ఒక పాపులర్ ఫ్యాషన్ డిజైనర్, చైతన్య డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్ పర్ట్. కొన్నేళ్ల నుంచి ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. 2020లో కలిశారు. ఆ తర్వాత వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ విషయాన్ని ఇద్దరి పెద్దవాళ్లతో చెప్పి వారిని పెళ్లి ఒప్పించారు. ఆ తర్వాత ఆదివారం 200 మంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
“మన దేశంలో ఇలాంటి పెళ్లిళ్లకు ఒప్పుకోవాలంటే ప్రతి కుటుంబం ఆలోచనలో పడుతుంది. అలాగే మా కుటుంబాలు కూడా ఎంతో ఆలోచించాయి. కానీ, మా ప్రేమను అర్థం చేసుకుని వాళ్లు చివరకు ఒప్పుకున్నారు. మేము అందరిలాగానే శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాం.” అంటూ అభిషేక్, చైతన్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వారి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిషేక్, చైతన్య పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The first Gay Wedding in #Kolkata Let us Congratulate Abhishek Ray and Cheitan Sharrma for their Journey of love. #gaymarriage #kolkatawedding #kolkata #cityofjoy #marriageequality #samesexwedding #gaywedding #gayweddings #wedding #marriage #gayweddingkolkata #Lgbt #Gay #lgbtq pic.twitter.com/p1JO3XQvSM
— 🅰🅱🅷🅸🅹🅸🆃 🅶🅷🅾🆂🅷🏳🌈 (@abhi_handsome) July 4, 2022